ఈటల రాజేందర్ నిన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్పీకర్ ఫార్మట్‌లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దానిని స్పీకర్ అంగీకరించారు, ఇక బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఈటల రాజేందర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.. ఈటలతో పాటు మరో ఆరుగురు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు. అయితే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది.