ఆయనో ఎమ్మెల్యే. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పటికే విపక్షాలకు టార్గెట్ అయ్యారు. ఇదే సమయంలో అధికారపార్టీలో మరో చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన పోటీ చేస్తారా? కొత్త వ్యక్తి బరిలో ఉంటారా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? కొంతకాలంగా జర్మనీలోనే ఎమ్మెల్యే రమేష్! చెన్నమనేని రమేష్. వేములవాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. 2009 నుంచి ఆయన శాసనసభ్యుడిగా గెలుస్తూ వస్తున్నారు. స్థానిక రాజకీయాలు ఎలా ఉన్నా.. ఆయన…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పుడు కృష్ణానదిపై నిర్మిస్తోన్న ప్రాజెక్టులు చిచ్చుపెడుతున్నాయి.. ఓవైపు ఫిర్యాదులు చేస్తూనే.. మరోవైపు ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. జలవివాదంలో ఆంధ్ర నేతలపై తెలంగాణ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇప్పటికే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై విమర్శలు రాగా.. తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. వైఎస్సార్ తెలంగాణ ప్రాంతానికి రాక్షసుడు అంటూ విమర్శించారు. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ స్నేహ హస్తం ఇస్తే..…
నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ, మీకు కూడా గుణపాఠం చెబుతా అంటూ టీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన ఆయన.. ఆ తర్వాత తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పర్యటిస్తూ.. రానున్న ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.. వరుసగా ఆరు సార్లు విజయం సాధించా.. ఈసారి హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగురవేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.. మా బీజేపీ నేతలు వచ్చి…
కరీంనగర్ జిల్లా ఇళ్లంతకుంట మండల బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… మా నియోజక వర్గంలో ప్రజా ప్రతినిధులు నాకు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధం ఉంది. కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. తల్లి తండ్రి విడిపోయినప్పుడు పిల్లలను పంచుకునే సమయంలో తల్లిదండ్రులు పడే వేదన నాది మా ప్రజా ప్రతినిధులది. మమ్మల్ని విడగొట్టి పాపం మూటగట్టుకున్నారు. కేసీఆర్ దుర్మార్గాలకు గొరి కట్టే బాధ్యత హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలపై ఉంది. నా మీద కేసీఆర్ దుర్మార్గంగా…
ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఇప్పుడు పార్టీలను పట్టుకొని తిరుగుతున్నారు. పొలిటికల్ ఫ్లాట్‌ఫాం కోసం కండువాలు మార్చేస్తున్నారు. అయినప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు. పైగా ఏ పార్టీలో చేరినా గ్రూప్‌వార్ ఆయన్ని వెంటాడుతోంది. ఇంతకీ ఎవరా జంప్ జిలానీ? గ్రూప్‌వార్ కారణంగా టీఆర్‌ఎస్‌లో టికెట్ రాలేదా? రమేష్ రాథోడ్. మాజీ ఎంపీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు. 2014లో…
దమ్ముంటే మీ సిద్ధాంతం చెప్పుకో.. కానీ, ఘర్షణకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం చల్లూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మండల ముఖ్యకార్యకర్తలు సమావేశానికి హాజరైన బీజేపీ నేత ఈటల.. ఈసందర్భంగా మాట్లాడుతూ.. వీణవంక మండలంలో అక్కడొక దొర, ఇక్కడొక దొర ఉన్నారని ఎద్దేవా చేశారు.. మేం ఎవరి జోలికి వెళ్లం.. ఈ 20ఏళ్లలో ఎప్పుడు గొడువలకు తావు ఇవ్వలేదని.. ఎప్పుడైన శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించకునేదన్నారు..…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పటివో అయినా.. ఈ మధ్య తరచూ విమర్శలు, ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… మీకు నిజాయితీ ఉంటే అక్రమంగా చేపట్టిన ఆర్డీఎస్ పనులను ఆపాలని డిమాండ్ చేశారు.. ఆర్డీఎస్ పై అవగాహన లేని బచ్చాగాళ్లు ముఖ్యమంత్రి రాసిచ్చిన కాగితాలు చూసి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయిన ఆమె.. ఆంధ్రవాళ్లు అని విమర్శించే వారు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది…
తేదీ నిర్ణయం కాకపోయినా.. హుజురాబాద్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన ఈ సీటు టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానం. అందుకే ఉపఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థి ఎవరన్నది సస్పెన్స్‌గా మారింది. సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేస్తారా? ఇంకేమైనా లెక్కలు ఉన్నాయా? లెట్స్ వాచ్. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరు? హుజురాబాద్‌లో ఆత్మగౌరవం నినాదంతో ఈటల రాజేందర్ జనాల్లోకి వెళ్లి.. సానుభూతిని కూడగట్టే యత్నం చేస్తున్నారు. ఈటల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ…
కరోనా కష్టసమయంలోనూ రైతులకు అండగా ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం… రైతులకు పంటసాయంగా రైతు బంధు పథకం కింద ఇచ్చే సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 59.71 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.6663.79 కోట్లు జమ చేసినట్టు ప్రకటించింది కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్.. ఇవాళ ఒకేరోజు 2.10 లక్షల మంది రైతుల ఖాతాలలో 13.02 లక్షల ఎకరాలకు గాను రూ.651.07 కోట్లు జమ అయ్యాయని.. ఇప్పటి వరకు మొత్తం 133.27…
తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం మరింత ముదిరి మాటల యుద్ధానికి తెరలేచింది.. తాజాగా, తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. ఒక మంత్రి అయిఉండి ముఖ్యమంత్రిని గజదొంగ అని వ్యాఖ్యానించటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.. ఏపీకి కేటాయించిన నీళ్లు కాకుండా అదనంగా చుక్క నీళ్లు కూడా వాడుకోవటం లేదనే విషయం తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలుసుకోవాలని.. ప్రజల…