ఈటల రాజేందర్ పై మరోసారి కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సెక్రెటరీ కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆస్తులను కాపాడుకోవడానికి ఈటల బీజేపీలో చేరారని… జార్జిరెడ్డి కమ్యూనిస్టు భావజాలం గల మీరు బిజెపిలో ఎలా చేరతారని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. ఏడున్నర సంవత్సరాల ముదురాజ్ బిడ్డలకు ఉద్యోగ కల్పన కల్పించారా? బిసి నాయకులుగా ఉన్న మీరు వారికి ఎం చేశారని నిలదీశారు. కౌశిక్ రెడ్డిని ఓడించుటకు బిసి నాయకులకు బ్యాంక్ లోన్ కల్పిస్తామన్న మీరు ఎంత మందికి కల్పించారని… హుజురాబాద్ పట్టణంలో నీళ్లు కల్పిస్తామన్న మీరు మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు అందించలేదని ఫైర్ అయ్యారు. కమలపూర్ లో HP గ్యాస్ గో డౌన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని…కౌశిక్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వండి..రెండు సంవత్సరాలు మీ కోసం పని చేస్తానని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డికి ఓటు వేస్తే గడిలా ధోరకు ఓటు వేసినట్లు అన్న ఈటెల… 100 కోట్లు సంపాదించి గడీలు కట్టుకున్న ఈటల… దళితులను అవమానించి బీజేపీలో చేరాడని మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇస్తే..అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు కౌశిక్ రెడ్డి.