IND vs NZ Final: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ Final: 2026 T20 ప్రపంచ కప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, ఈ మెగా ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంటే విజేతను ఎలా నిర్ణయిస్తారు? ఐసీసీ (ICC) నిబంధనలు ఏం చెబుతున్నాయి? పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: LPG Production: LPG ఉత్పత్తిని పెంచండి.. ఇంధన సంస్థలకు కేంద్రం ఆదేశాలు..!
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగితే ఫలితం కోసం ఐసీసీ కింది నిబంధనలను అమలు చేస్తుంది.
రిజర్వ్ డే (Reserve Day): మార్చి 8న వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోయినా లేదా అసంపూర్తిగా ఆగినా, మరుసటి రోజు అంటే మార్చి 9ని ‘రిజర్వ్ డే’గా కేటాయించారు.
ఆగిన చోటు నుంచే..: ఒకవేళ మార్చి 8న టాస్ పడి, కొంత ఆట జరిగిన తర్వాత వర్షం పడితే, రిజర్వ్ డే నాడు మ్యాచ్ మళ్లీ మొదటి నుంచి కాకుండా ఆగిపోయిన పాయింట్ నుంచే కొనసాగుతుంది.
అదనపు సమయం: మ్యాచ్ పూర్తి చేయడానికి వీలుగా రెండు రోజులూ 120 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ఓవర్ల తగ్గింపు ద్వారా అయినా ఫలితం రాబట్టేందుకు అంపైర్లు ప్రయత్నిస్తారు.
కనీస ఓవర్లు: ఫైనల్ ఫలితం తేలాలంటే రెండు జట్లు కనీసం 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ రెండు రోజులూ ఆట సాధ్యం కాకపోతే..
దురదృష్టవశాత్తూ మార్చి 8, 9 తేదీల్లో కూడా వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి కాకపోతే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్ – న్యూజిలాండ్ జట్లను ‘సంయుక్త విజేతలు’ (Joint Winners)గా ప్రకటిస్తారు. గతంలో 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-శ్రీలంక మధ్య ఇలాగే టైటిల్‌ను పంచుకోవడం జరిగింది. అయితే టీమ్ ఇండియా వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా రెండు టైటిళ్లు నెగ్గలేదు. కానీ ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు అంత మంచి రికార్డు లేదు. ఇప్పటివరకు టీమ్ ఇండియా T20 ప్రపంచ కప్‌లో కివీస్‌ను ఓడించలేదు. ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని టీమిండియా భావిస్తోంది. ఇదే సమయంలో తొలిసారి T20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడాలని న్యూజిలాండ్ కూడా ఎంతో కసితో ఉంది.
READ ALSO: Anuj Agnihotri: యూపీఎస్సీ 2025 టాపర్‌గా నిలిచిన డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి! ప్రస్థానం ఇదే..
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!