మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేటీఆర్. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక సిరిసిల్ల జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరుగుతుందని..తెలంగాణకు, సమైక్యాంధ్రకు తేడా..శభాష్ పల్లి బ్రిడ్జి నిదర్శనమన్నారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణలో రహదారులు అభివృద్ధి జరుగుతు న్నాయని..తెలంగాణ వచ్చాక సిరిసిల్ల వాటర్ జంక్షన్ గా మారిందన్నారు. తెలంగాణకు గుండె కాయ మిడ్ మానేరు ప్రాజెక్టు అని..త్వరలో సిరిసిల్లకు రైల్వే లైన్ వస్తుందని పేర్కొన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి వేములవాడ రాజన్న ఆలయం వరకు పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని.. తప్పకుండా జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆనాటి కరువు ప్రాంతాలు సిరిసిల్ల, వేములవాడ నేడు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని.. కేసీఆర్ ను తిడితే మీరు పెద్ద నాయకులు కాలేరని మండిపడ్డారు.