పార్లమెంట్ సమావేశాల మాటున ఢిల్లీలో ఆ ఎంపీ సొంత కార్యాలు చక్కబెట్టుకుంటున్నారా? ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న అతను.. ఇప్పుడెందుకు పావులు కదుపుతున్నారు? మనసు మార్చుకున్నారా? మార్పు వెనక కథేంటి? ఎవరా ఎంపీ?
ఈటల వ్యాపార భాగస్వామి కావడంతో భేటీకి ప్రాధాన్యం!
ప్రధాని మోడీ మంత్రివర్గంలో ఇటీవల కేబినెట్ మినిస్టర్‌గా ప్రమోషన్ పొందిన కిషన్‌రెడ్డిని.. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కలిసి మాట్లాడారు. ఒకే రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్నందున కలిశారులే అని కొట్టి పారేయడానికి ఈ భేటీ లేదన్నది రాజకీయ వర్గాల మాట. అందుకే.. కిషన్‌రెడ్డితో రంజిత్‌రెడ్డి ములాఖత్ టీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతోంది. ఇటీవల టీఆర్‌ఎస్‌ను వీడి.. బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు రంజిత్‌రెడ్డి సన్నిహితుడు కావడం కూడా ఇక్కడ కీలక పాయింట్. ఆయన ఈటలకు సన్నిహితుడే కాదు.. మిత్రుడు.. వ్యాపార భాగస్వామి కూడా. ఈటల ఎపిసోడ్‌లో ఇంత వరకు రజింత్‌రెడ్డి ఓపెన్‌గా మాట్లాడింది లేదు. వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.
కాలుజారిపడినా.. అందరినీ కలుస్తున్నారు?
ఆ మధ్య ఎంపీ రంజిత్‌రెడ్డి మార్నింగ్ వాక్‌కు వెళ్తూ కాలుజారి పడ్డారు. మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్ చేసిన తర్వాత ఈ ఘటన జరిగింది. దీంతో రెండు మూడు నెలలు బెడ్‌రెస్ట్‌లో ఉంటానని కార్యకర్తలకు, పార్టీ నేతలకు ఎంపీ చెప్పారట. అయితే ఆయన అమెరికా వెళ్లి వచ్చారు. పలు శుభకార్యాల్లోనూ పాల్గొన్నారు. ఈటల ఎపిసోడ్ తర్వాత సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి వచ్చారు రంజిత్‌రెడ్డి. కానీ.. మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో రంజిత్‌రెడ్డి భేటీ కావడం వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ మొదలైంది.
మర్యాదపూర్వక భేటీలో చర్చకు వచ్చిన అంశాలేంటి?
ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగానే ఎంపీ రంజిత్‌రెడ్డి కలిశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తెలంగాణ అభివృద్ధి పనులపై మాట్లాడారట. కేంద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు.. ఇతర అంశాలపై చర్చించారట. ముఖ్యంగా పార్లమెంట్ పరిధిలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కిషన్‌రెడ్డిని కోరారట. బయటకు ఇలాంటి విషయాలు ఎన్ని చెబుతున్నా.. లోగుట్టు ఇంకేదో ఉందని చెవులు కొరుక్కోవడం మాత్రం ఆగడం లేదు. మరి.. ఈ భేటీ ఇంకెన్ని ఊహాగానాలకు దారితీస్తుందో చూడాలి.