హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటల కు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే… ఉదయం నుంచి ప్రశాంతంగా సాగిన ఈ ఉప ఎన్నికలో కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హుజురాబాద్ వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కోర్కల్ లో పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొట్టుకున్న కార్యకర్తల్లో మహిళలు…
కేసీఆర్ లేని తెలంగాణ ను ఊహించుకోలేము. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మన నాయకునిపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. మనం ఎందుకు ఊర్కోవాలి.. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బిజెపి,కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు లేవు అని ప్రశ్నించారు. మా రైతు ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ వ్యవసాయ కరెంట్ మోటర్ల కాడ మీటర్లు ఒప్పుకోలే. ప్రభుత్వరంగ సంస్థలన్ని మోడీ సర్కారు…
కేసీఆర్ అసమర్థతతోనే ప్రాజెక్టులన్ని సమాధి అవుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయనా మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై NGT స్టే ఇచ్చిందని, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడానికి చూశారు .. ఇప్పుడు పనులు మధ్యంతరంగా ఆగిపోయాయన్నారు. కేసీఆర్‌కు కొందరు కాంట్రాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు, ప్రాజెక్ట్ రీ డిజైనింగ్ చేశారు. మూడేళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఆరేళ్లయినా పూర్తి కాలేదన్నారు. ప్రభుత్వం అసమర్థత…
ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే ఈ వివాదం రోజు రోజుకు హీట్ పుట్టిస్తుంది. మొన్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఏ పంట వరి పంట వేయోద్దని వరి విత్తనాలు అమ్మొద్దని హెచ్చరించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు సైతం ఫైర్ అయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై మండి పడ్డారు. రైతుల జోలికి వస్తే ఊరుకోమని కలెక్టర్‌ను హెచ్చరించారు. ఇదిలా ఉంటే తాజగా ధాన్యం కొనుగోళ్లపై…
హుజురాబాద్‌లో గెలుపు బీజేపీకి అవసరం… ఈటల రాజేందర్‌కి అత్యవసరం. ఈటల దశాబ్ధాల రాజకీయ భవిష్యత్ ఈ ఎన్నికతో ముడిపడి ఉంది. దుబ్బాకలో గెలిచిన తర్వాత.. బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నిక హుజురాబాద్. టీఆర్‌ఎస్‌కు ధీటుగా, పోటీగా బీజేపీ కూడా చతురంగ బలగాలను మోహరించింది. బీజేపీ ప్రచారానికి ఫలితం దక్కుతుందా? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలనే కసితో ఉంది కమలదళం. దుబ్బాక పోరులో విజయం సాధించడం, గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చూపించడంతో.. కమలంపార్టీ నేతల్లో…
ఈ రోజు ఉదయం విసిరిన రాజీనామా సవాల్ స్వీకరించకుండా 2 గంటలకే బీజేపీ నేతలు దీక్షశిబిరం వదిలిపోయిన నేపథ్యంలో ఈ సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. 2022కు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాననిమోడీ అన్నారని దానికి తీసుకున్న చర్యలేవో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. 11 గంటల నుంచి 2 గంటల వరకు చేసేదాన్ని దీక్ష అంటారా ? అని…
యాసంగి పంటను కొనే దమ్ము బీజేపీకి ఉందా ఉంటే ఎన్ని లక్షల టన్నుల కొంటారో తేల్చి చెప్పాలని, ఆ మాట చెప్పకుండా బీజేపీ డ్రామాలు ఆడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎఫ్‌సీఐ ఇచ్చిన లేఖ తమ దగ్గరుందని మంత్రి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత యుత ప్రభుత్వం అని అన్నారు. అన్ని లక్షల టన్నుల ధాన్యం కొంటామన్నారు. వానాకాలమే కేంద్రం మోసం చేసే ప్రయత్నం చేసిందని దానిని మేము రాజకీయంగా వాడుకోలేదని మంత్రి తెలిపారు. ప్రజల…
సిద్ధిపేట కలెక్టర్ రైతులపై మాట్లాడిన మాటలు నియంతలా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దేవుళ్లతో సమానమని తెలిపారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ – బీజేపీ ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. రైతుల పొట్టగొట్టి నడ్డి విరిచి రోడ్డు పాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని జగ్గారెడ్డి విమర్శించారు. వరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలన్నారు. బండి సంజయ్, తెలంగాణ మంత్రులు…
ఒకరేమో మాజీ ఎమ్మెల్యే. మిగతా ఇద్దరిదీ అక్కడ టికెట్ సంపాదిస్తే ఎమ్మెల్యే అయిపోవచ్చనే ఆశ. ముగ్గురూ ముగ్గురే. ఎవరి ఎత్తులు వారివే. పార్టీలోని ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టే అంశం చిక్కితే.. రచ్చరచ్చ చేసి విడిచి పెడుతున్నారు. వారెవరో? ఆ నియోజకవర్గం ఏంటో? లెట్స్ వాచ్..! దళిత సర్పంచ్ సస్పెన్షన్‌పై మునుగోడు టీఆర్ఎస్‌లో రగడ..! నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా.. టీఆర్ఎస్ నాయకుల్లో వర్గపోరు పులుపు చావలేదు. నేతలు ఎక్కువ..…