ప్రభుత్వం పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన సూచనలు, ప్రతిపాదనలకు సంబంధించి ఒక కమిటీ వేశారు. ఆయా జిల్లాలకు సంబంధించి మంత్రుల ఆధ్వర్యంలో ఈ కమిటీ అఖిల పక్షం సూచనలు తీసుకుంటుంది. దాని అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మంత్రి సబిత ఇంద్రారెడ్డి శనివారం అఖిలపక్ష నాయకులతో సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ కమిటీ వేశారన్నారు.…
ఇటీవలే టీఆర్‌ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో నూతన గ్రామ కమిటీలను, మండల కమిటీలను టీఆర్‌ఎస్ నియమించింది. అంతేకాకుండా టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా 9వ సారి కూడా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం కూడా హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. వచ్చే నెలలో వరంగల్‌లో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానంటూ.. గతంలో సీఎం కేసీఆర్…
గత కొంత కాంలంగా రాష్ట్రంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులపై అనేక సార్లు అటవీఅధికారులు దాడికి పాల్పడ్డారు. ఇదే సమయంలో తమకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని రైతులు ఎన్నో సార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. తాజాగా శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు.…
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్ చిన్న చిన్న గోడవలు మినహా… ఇప్పటి వరకైతే… పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే జమ్మి కుంట మండలంలో హై డ్రామా నెలకొంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ కిషన్ రెడ్డి ఇంటి ముందు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కిషన్ రెడ్డి ఇంటిని తనికీ చేయాలని బీజేపీ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కౌన్సిలర్ ఇంటిని సీపీ సోదా చేయడంతో అక్కడి…
గత 5 నెలలుగా సాగిన ఉత్కంఠకు నేడు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో టీఆర్‌ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిననాటి నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోపక్క టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు హుజురాబాద్ కేంద్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు…
హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈ రోజు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 306 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనంటూ.. ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు పోలీసులు షాక్…
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకే మొదలైంది. ఉదయం పలు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని హిమ్మత్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భార్య శ్వేత మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నాన్ లోక్సల్స్ ఎందుకు నియోజకవర్గంలో ఉన్నారంటూ, ఓటర్లను ప్రలోభ పెడుతోందంటూ తుల ఉమను గెల్లు శ్వేత…
టీఆర్ఎస్ చీఫ్.. ఏపీలో పార్టీ పెడతారో లేదో కానీ.. ప్లీనరీలో ఆయన చేసిన ప్రకటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార వైసీపీ కౌంటర్లపై కౌంటర్లు వేస్తోంది. రాజకీయ లబ్ధికోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు.. ఈ రగడను అనేక మలుపులు తిప్పుతోంది. మాటల దాడి ఇక్కడితో ఆగుతుందా? మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో పార్టీలు ఉన్నాయా? రెండు రాష్ట్రాలను కలిపేస్తే సమస్యే ఉండబోదన్న పేర్ని నాని..! టీఆర్‌ఎస్ ప్లీనరీలో గులాబీ బాస్.. సీఎం కేసీఆర్ చేసిన…
నవంబర్ 15న వరంగల్‌లో తలపెట్టిన మహాగర్జన సభకు భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు తరలి రావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయడంతో పాటు ఇవ్వని హామీలను కూడా పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు నిందించడమే పరమావధిగా పెట్టుకున్నాయని, ప్రతిపక్ష పార్టీలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వాలు తొందరగా పూర్తి చేసుకున్న…
చాలారోజుల తర్వాత తెలంగాణలో ఆర్టీసీకి రవాణా మంత్రి.. సంస్థకు ఛైర్మన్, పూర్తిస్థాయి ఎండీ వచ్చారు. ఈ మార్పు రుచించలేదో ఏమో.. ఆర్టీసీవైపు కన్నెత్తి చూడటం లేదు మంత్రి. సంస్థ ఛైర్మన్‌ను కలిస్తే ఒట్టు. కలిసి సమీక్షల్లేవ్. ఎందుకిలా? మంత్రికి ఉన్న అభ్యంతరాలేంటి? ఆర్టీసీ వ్యవహారాలపై మంత్రి టచ్ మీ నాట్..! పువ్వాడ అజేయ్ కుమార్… తెలంగాణ రవాణా మంత్రి. బాజిరెడ్డి గోవర్దన్… తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆర్టీసీలో వ్యవహారాలను అన్నీ తానై చూసిన…