తెలంగాణ రాష్ట్రంలో మరొ కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు సమాచారం అందుతోంది. డాక్టర్ వినయ్ నేతృత్వం లో ఈ కొత్త పార్టీ ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు హైదరాబాద్ బంజారా ఫంక్షన్ హాల్ లో తన మద్దతు దారులతో డాక్టర్ వినయ్ భేటీ అయ్యారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో అందరికి న్యాయం జరగాలనే డిమాండ్ తో కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా వినయ్ కుమార్ అడుగులు వేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి…
ఏపీలో పార్టీ విస్తరిస్తామన్న సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. నాడు-నేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చామని, టీఆరెస్ పాలనలో ఒక్కటైనా మార్చారా అంటూ ఫైరవుతున్నారు. మొన్న సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు… ఇప్పుడు హాట్ టాపిగ్గా మారాయ్. ఏపీలోనూ పార్టీ పెట్టాలంటూ ఆహ్వానాలు వచ్చాయన్న ముఖ్యమంత్రి కామెంట్లపై స్పందిస్తున్నారు ఏపీ మంత్రులు. తెలంగాణ కంటే ఏపీలోనే పాలన బాగుందని కితాబిచ్చుకుంటున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్ల టాయిలెట్స్ ఎలా ఉన్నాయో.. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్ల…
హుజురాబాద్ ఉపఎన్నికపై బెట్టింగ్ కోట్లల్లో నడుస్తోంది. ఏ పార్టీ గెలుస్తుంది..ఎన్ని ఓట్ల తేడాలో గెలుస్తుంది..ఏఏ ప్రాంతాల్లో ఎన్ని ఓట్లు వస్తాయని పెద్దఎత్తున పందాలు కాస్తున్నారు. బెట్టింగ్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో రహస్యంగా కొనసాగుతోంది. ఆఫ్‌లైన్‌లో సైతం బెట్టింగులు సాగుతున్నాయ్. హుజురాబాద్ ఉపఎన్నిక గెలుపు ఓటములపై కోట్లలో బెట్టింగులు సాగుతున్నాయి. తెలంగాణకు చెందిన వారితో పాటు వివిధ రాష్ట్రాల వారు సైతం బైపోల్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్ ముగియడంతో పందెంరాయుళ్లు ఉపఎన్నికపై బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గత నెల నుంచే బెట్టింగ్…
హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. అధికార పక్షం టీఆర్ఎస్‌పై ఓవైపు బీజేపీ ఫిర్యాదులు అందిస్తుంటే.. మరోవైపు.. బీజేపీ గీత దాటుతోంది ఇవిగో ఆధారాలంటూ టీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఇక, ఇవాళ బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు.. 31-హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు టీఆర్‌ఎస్ నేతలు.. రఘునందన్ రావు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారని..…
టీఆర్ఎస్ విజయోత్సవ సభ తర్వాత ఒక్కొక్కరికి పిచ్చి పడుతుందని వ్యాఖ్యానించారు మంత్రి జగదీష్ రెడ్డి.. నల్గొండ కలెక్టరేట్‌లో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు, వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే కేవలం 24 లక్షల టన్నులే తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, సీఎం కేసీఆర్ చొరవతో 45 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు.. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్‌లో వరి సాగు…
బహుజనుల స్వయం పాలన ప్రతిజ్ఞ సభకు హాజరైన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అధికార టీఆర్‌ఎస్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో లక్షలాది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి టీఆర్ఎస్ 20 ఏళ్ల విజయోత్సవాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటన్నారు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు గొర్లు, బర్లు, చేపలు పంపిణీ చేస్తూ బీసీలను కులవృత్తులకు పరిమితం చేస్తున్నందుకా, టీఆర్‌ఎస్ విజయోత్సవాలు నిర్వహించేది ఎందుకని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. వందలాది మంది విద్యార్థి అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ కేసీఆర్…
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం తెలంగాణ భవిష్యత్ రాజకీయ గమనాన్ని నిర్ధేశించనుంది. కేసీఆర్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా బలమైన ఓ ప్రచార నినాదాన్ని నిర్మించడానికి హుజూరాబాద్ విజయం దోహదం చేస్తుంది. టీఆర్‌ఎస్ గెలిస్తే పార్టీపై కేసీఆర్ ఉక్కు పిడికిలి మరింత బిగుసుకుంటుంది. సమీప భవిష్యత్తులో…
రైతు తన నిర్ణయంతో పంటలు వేయకూడదా..? సిద్ధిపేట కలెక్టర్ చెప్పిందే వేయాలా..? సిద్ధిపేట జిల్లా లో ఏ పంట వేయాలనేది కలెక్టర్ నిర్ణయిస్తాడా..? ఏ అధికారంతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నాడంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కలెక్టర్‌పై ఫైర్ అయ్యారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ..అవగాహన లేని వెంకట్రామిరెడ్డి ని కలెక్టర్ గా ఇన్నాళ్లు గా ఎందుకు కొనసాగిస్తున్నారు అని ప్రశ్నించారు. సిద్ధిపేట కలెక్టర్ మాటలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు జగ్గారెడ్డి. రైతులకు అండగా ఉంటాం.…
హుజురాబాద్‌లో ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీలు ప్రచార జోరును పెంచుతున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా మంగళవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ తరుణ్ చుగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే బీజేపీ ఈటల గెలిస్తే నియోజకవర్గానికి వచ్చే పనులను వివరించారు. తరుణ్ చుగ్ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం హుజురాబాద్ ప్రజలను, రాష్ట్ర ప్రజలను అవమానించిందని, కుక్కను పెట్టినా గెలుస్తామని అన్నారన్నారు. ఈ ఎన్నికల్లో…
టీఆర్ఎస్ ఫ్లీనరీ సమావేశంపై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం మొత్తం.. వారి పొగడ్తలకే సరిపోయింది. అమరులను ఒక్కరినీ గుర్తు చేసుకోలేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూసీ కాల్వలో మురికి ఎంతుందో.. టీఆర్‌ఎస్ నేతల అవినీతి అంతలా పేరుకుపోయిందన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌కు వందల ఎకరాల భూమి , ఇతర దేశాల్లో…