బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం ఎమ్మెల్యే రాజాసింగ్ అధ్యక్షతన సోమవారం జరిగింది.ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌పై విమర్శలు సంధించారు. ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నికపైనే ఈ సమావేశం జరిగినట్టు ఆయన వివరించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయ త్నాలు కేసీఆర్ చేశారన్నారు. సర్వేల ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజాసింగ్ విమర్శించారు. కేసీఆర్ ఎన్ని సర్వేలు చేయించుకున్నా బీజేపీ గెలుస్తుందని రిపోర్ట్ రావడంతో చివరకు డబ్బులు పంచి గెలవాలని చూశాడని…
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. కరీంనగర్ లోని SR డిగ్రీ కాలేజ్ లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. రెండు హాల్స్ ఉంటాయి.. 22 రౌండ్స్ లో కౌంటింగ్ జరగనున్నట్టు ఆయన వెల్లడించారు. రేపు ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తామని, ముందగా పోస్టల్ ఓట్లు లెక్కించనున్నట్టు ఆయన తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి సంబంధించి…
వానాకాలం ధాన్యం సేకరణపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలంలో పండిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి మంత్రి అధికారులతో చర్చించారు. ఏయే జిల్లాల్లో ఎంత ధాన్యం కొనుగోలు చేయాలని దానిపై మంత్రి అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో 1033 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు. అవసరమైన చోట నూతనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గన్నీ…
తెలంగాణలో తాజాగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నేతల పైరవీలు, ఆశవాహుల ఎదురు చూపులతో అధికార టీఆర్‌ఎస్ పార్టీలో ఒక మినీ యుద్ధమే నడుస్తుందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఆయా నేతలు తమ కంటే తమకు అని నేతలు ఎవరికి వారే పోటీ పడుతున్నారు. ప్రస్తుతం శాసనసభలో ఒక నామినేటడ్ స్థానంతో కలిపి మొత్తం 120 స్థానాలు ఉండగా, ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఖాళీ అయింది.…
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో పండిన పంటను, ఒక గింజ కూడా కొనలేము అని ఎఫ్‌సీఐ, కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన సహకారం రావడం లేదని, ఎఫ్‌సీఐ ఎప్పటికప్పుడు వడ్లు తీసుకోకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఢిల్లీలోని ప్రభుత్వం వడ్ల కొనుగోలు పై మొండివైఖరి…
హుజురాబాద్ ఉపఎన్నిక ప్రక్రియ ముగిశాక.. పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ క్లియర్ అవుతుందా? టీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఆయన.. ఇంకా ఎదురు చూడాలా? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది.. తేలని కౌశిక్‌రెడ్డి పదవి..! పాడి కౌశిక్‌రెడ్డి. 2018లో హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి. ప్రస్తుత ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో అనూహ్యంగా టీఆర్ఎస్‌లో చేరారు. గులాబీ కండువా కప్పుకొన్న రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్సీని చేస్తున్నట్టు అధికారపార్టీ తీపి కబురు అందించింది. గవర్నర్…
రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల ఆధైర్యపడవద్దని కేంద్ర కొనకపోయినా మేం ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. అంతేకాకుండా అధికారులు గతంలోని అనుభవాలతో ముందు సాగాలని సూచించారు. రైతులకు సాగునీరు, 24 గంటల విద్యుత్, పంట పెట్టుబడి ఇస్తున్న ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. అంతేకాకుండా కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. చివరి ధాన్యపుగింజను…
హుజురాబాద్‌లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌గోయల్ మీడియాకు తెలిపారు. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు తప్ప ఏం జరగలేదన్నారు. ప్రస్తుతానికి 86.40శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు. 220,223,224,237 పోలింగ్ బూతులో ఇంకా పోలింగ్ శాతం లెక్కించలేదు. సాయంత్రం 7 గంటల వరకు చాలా చోట్ల పోలింగ్ ముగిసింది. 224,237 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చాలా బాగా చేశారు.…
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ విజయవంతంగా ముగిసింది. అయితే కొన్నిచోట్ల స్వల్ప వాగ్వాదాలు చోటు చేసుకున్నప్పటికీ మినహా పోలింగ్ ప్రక్రియ హుజురాబాద్ నియోకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ.. హజురాబాద్ ఓటర్లు చైతన్యం చాటారని ప్రశంసించారు. కేసీఆర్ మార్గదర్శకత్వం, హుజురాబాద్ ప్రజల ఆశీస్సులతో గొప్ప విజయం సాధించబోతున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉప ఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన…
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు తప్ప పెద్దగా ఏమీ జరగలేదు. దీంతో ఎన్నికల కమిషన్ ఊపిరి పీల్చుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రత్యేకమైనది కావడంతో నాయకుల్లో గుబులు పట్టుకుంది. పెరిగిన పోలింగ్ శాతం ఎవ్వరికి లాభిస్తుందోనని నాయకులు ఆందోళనలో ఉన్నారు. హోరాహోరిగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సాయంత్రం 7గంటల వరకు 86.40 శాతం పోలింగ్ నమోదు అయింది. గతంలో కన్నా ఈసారి ఎక్కువగా పోలింగ్ జరగడంతో ఎవ్వరికి ఎక్కువ…