హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపేందుకు రేవంత్ రెడ్డి నిన్న రాత్రి నుంచే డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఈ డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని, తనపై జరుగుతున్న కుట్రలకు తాను భయపడనని స్పష్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. “మా లీగల్ టీమ్‌కు పేరు పేరునా కృతజ్ఞతలు. నన్ను జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడను.
మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరంపై నిజానిజాలు త్వరలో తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. "నా డౌట్ అయితే కాంగ్రెస్ వాళ్లే కూలగొట్టి ఉంటారు.. మేడిగడ్డ దగ్గర బాంబో లేదా మరొకటో పెట్టుంటారు.. కాంగ్రెస్‌లో అలాంటి పని చేసే వాళ్లు ఉన్నారు." అని కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు.
Harish Rao : అంగన్వాడీ ఉద్యోగుల జీతాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి宀కు ఆయన బహిరంగ లేఖ రాశారు. అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది గడుస్తున్నా, వేతనాల పెంపు మాట మరిచిన ప్రభుత్వం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొట్టి ప్రచారం చేసుకున్నదని, కానీ వాస్తవంగా మూడు నెలలకే పెరిగిన జీతం చెల్లించి మిగతా నెలలంతా…
Minister Seethakka : మహిళా సంఘాల బ్యాంకు రుణాలకు ప్రజా ప్రభుత్వం వడ్డీలు చెల్లించడం లేదన్న మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పరేడ్ గ్రౌండ్లో మహిళా సభ విజయవంతమైంది. అందుకే కడుపు మంటతో కళ్ళల్లో నిప్పులు పోసుకొని హరీష్ రావు అబద్ధాలు వల్లే వేస్తున్నారన్నారు. మీ ప్రభుత్వంలో మహిళలకు మీరేం చేయలేదని విషయం మహిళలందరికీ తెలుసు అని, వడ్డీ లేని రుణాలు…
నిన్న మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరేడ్ గ్రౌండ్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అబద్ధాలు మాట్లాడేవారని.. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారన్నారు.