తెలంగాణలో ఇజ్జత్ కా సవాల్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జయకేతనం ఎగుర వేసింది. ఉత్కంఠ పోరులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కూసుకుంట్ల గెలుపొందారు. 15 రౌండ్లు ముగిసే సరికి కూసుకుంట్ల 10,006 ఓట్ల తేడాతో విజయం సాధించారు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. డిపాజిట్ కోల్పోయింది కాంగ్రెస్. మునుగోడులో మొత్తం 241805 ఓట్లర్లు ఉండగా.. 225192 మంది ఓటేశారు. మరో 658 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రౌండ్ 1
టీఆర్ఎస్-6418
కాంగ్రెస్ -2100
బీజేపీ-5126 ఓట్లు
రౌండ్ 2
టీఆర్ఎస్-7781
కాంగ్రెస్ -1537
బీజేపీ-8622
రౌండ్ 3
టీఆర్ఎస్-7390
కాంగ్రెస్ -1926
బీజేపీ-7426
రౌండ్ 4
టీఆర్ఎస్-4854
కాంగ్రెస్ -1817
బీజేపీ-4555
రౌండ్ 5
టీఆర్ఎస్-6062
కాంగ్రెస్ -2683
బీజేపీ-5245
రౌండ్ 6
టీఆర్ఎస్-6016
కాంగ్రెస్ -1962
బీజేపీ-5378
రౌండ్ 7
టీఆర్ఎస్-7202
కాంగ్రెస్ -1664
బీజేపీ-6803
రౌండ్ 8
టీఆర్ఎస్-6620
కాంగ్రెస్ -907
బీజేపీ-6088
రౌండ్ 9
టీఆర్ఎస్-7517
కాంగ్రెస్ -1684
బీజేపీ-5877
రౌండ్ 10
టీఆర్ఎస్-7503
కాంగ్రెస్ -1347
బీజేపీ-7015
రౌండ్ 11
టీఆర్ఎస్-7214
కాంగ్రెస్ -1788
బీజేపీ-5853
రౌండ్ 12
టీఆర్ఎస్-7448
కాంగ్రెస్ -1828
బీజేపీ-5448
రౌండ్ 13
టీఆర్ఎస్-6691
కాంగ్రెస్ -1206
బీజేపీ-5346
రౌండ్ 14
టీఆర్ఎస్-6608
కాంగ్రెస్ -1828
బీజేపీ-5553
రౌండ్ 15
టీఆర్ఎస్-1270
కాంగ్రెస్ -238
బీజేపీ-1358
ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు?
మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలకు లభించిన ఓట్లు ఇలా వున్నాయి..
టీఆర్ఎస్ కు 42.9 శాతం
బీజేపీకి 38.41 శాతం
కాంగ్రెస్ కు 10.6 శాతం
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించడంతో వేలాదిగా తరలివచ్చారు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సంబురాలు మిన్నంటాయి. బాణసంచా పేల్చి, నృత్యాలు చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు నినాదాల హోరెత్తిస్తున్నారు. డప్పు మోతలతో తెలంగాణ భవన్ ప్రాంతం గులాబీ మయం అయింది.
ఇదిలా ఉంటే… తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నిబంధనల ప్రకారం అధికారికంగా RO ఫలితాలు విడుదల చేస్తారు. 5 EVM లా VV ఫ్యాట్ల ను ర్యాండంగా లెక్కించి సరిచూసుకుంటారు. ఎక్కడ పక్షపాతం లేకుండా ఎన్నికల ప్రక్రియ ను ముగించాము. ఆరోపణలు ఎన్ని వచ్చిన ప్రొసీజర్ ప్రకారమే అన్నీ నిర్వర్తించాం. వ్యక్తిగత తప్పిదం పై ఆర్వో పై వేటు పడింది. దేశం మొత్తం ఫోకస్ ఉన్న మునుగోడు ఉపఎన్నిక ముగించాము. సిబ్బందికి సహకరించిన వారికి అభినందనలు. ఎలక్షన్ కోడ్ నవంబర్ 8న ముగుస్తుందన్నారు సీఈవో వికాస్ రాజ్.