తెలంగాణలో బీజేపీ 2023 ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. టీఆర్‌ఎస్ కి ధీటుగా పోటీ ఇచ్చేందుకు స్కెచ్ రెడీ చేస్తోంది. బీజేపీ ఎస్సీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపే కీలకం అంటున్నారు. ఎస్పీ నియోజకవర్గాల్లోని ఇతర కులాలను పార్టీ వైపు మళ్లించాలన్నారు. అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు వ్యవహారం జాతీయ నాయకత్వం చూస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.. నిన్న హైదరాబాద్ బీజేపీ సభలో ప్రశంగించిన శివరాజ్ సింగ్ చౌహాన్.. సీఎం కేసీఆర్ దమమున్నోడు అనుకున్నాను.. కానీ, ఇంతభయస్తుడు అనుకోలేదని ఎద్దేవా చేసిన ఆయన.. బండి సంజయ్‌ను జైల్లో పెట్టారంటేనే కేసీఆర్ ఎంతగా భయపడ్డారో అర్ధం అవుతుందన్నారు.. కేసీఆర్ అన్యాయ పాలనకు అగ్గి పెట్టేవరకూ విడిచిపెట్టం అంటూ హెచ్చరించారు.. అయితే, అదే స్థాయిలో చౌహాన్‌పై కౌంటర్ ఎటాక్…
తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.. శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడారని ఫైర్ అయిన ఆయన.. వంద ఎలుకలను తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉంది ఆయన వ్యవహారమని మండిపడ్డారు.. టీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు.. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం అయ్యావు అంటూ మండిపడ్డారు.. ఇక, నాలుగేళ్లు…
కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధిపేటలోని రంగదాంపల్లి వద్ద కార్యకర్తలను కలిసి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రముఖ్యమంత్రి నేతృత్వంలో పోలీసులు దాడి చేసిన తీరును దేశం మొత్తం చూసిందన్నారు. నీకు వత్తాసు పలికితే కేసులు లేవు.. లేదంటే కేసులు పెట్టి బెదిరిస్తావా అంటూ ఫైర్ అయ్యారు. రాష్ర్టంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. నా కార్యాలయంలో దాడులు…
తెలంగాణలో బియ్యం రాజకీయం బాగా పండుతోంది. కేంద్రం రైతుల పక్షం కాబట్టే 40 లక్షల టన్నుల బియ్యానికి అదనంగా మరో ఆరు లక్షల టన్నులు బియ్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు బీజేపీ శాసనాసభా పక్షం నేత రాజాసింగ్. కేంద్రం లేఖ రాయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం రైతుల పక్షాన ఎప్పుడూ ఉంటుంది. రాష్ట్ర మంత్రుల ఢిల్లీ పర్యటన అర్థం లేనిది. వాళ్లు ఢిల్లీ వెళ్లక…
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఎమ్మెల్యే లేకుండా ఎంపీ అరవింద్ ప్రారంభోత్సవం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నేతలు. ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. గన్నరం గ్రామం వైకుంఠ ధామం పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవాలకు వెళ్ళారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఆయన రావడానికి ముందే కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవాలు చేశారు టీఆర్ఎస్ నేతలు. పసుపు…
తెలంగాణలో మళ్ళీ ముందస్తు ఎన్నికలు రానున్నాయా? కేసీఆర్ గతంలోలాగే మళ్లీ ఎన్నికల నగారా మోగించనున్నారా? 2023లో రావాల్సిన ఎన్నికలు 2022లో ఎప్పుడైనా వస్తాయా? అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. సిద్ధంగా ఉండండి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు. రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో ఆరునెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ…
తెలంగాణలో రాజకీయాలు వేడిని రాజేస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, మరోవైపు తెలంగాణ బీజేపీ నేతల పర్యటనలతో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలో చలి చంపేస్తుంటే.. నేతలు వరి చుట్టూ రాజకీయాలను నడుపుతున్నారు. త్వరలో తెలంగాణ పర్యటనకు వస్తానన్నారు కేంద్ర హోం మంత్రి, బీజేపీ బాద్ షా అమిత్ షా. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని, కేసీఆర్ ట్రాప్ లో పడకండని హితవు పలికారు హోం మంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా కేసీఆర్‌తో…
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీఎల్పీ నేత రాజాసింగ్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. తన నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మీతో చర్చించాలని అపాయింట్ మెంట్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరడం లేదన్నారు. సభలో మీరు గతంలో ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను కలవవచ్చని, మాట్లాడవచ్చన్నారు. అసెంబ్లీ కార్యక్రమాల తర్వాత వందల సార్లు మీతో మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ కుదరలేదు. మీకు ఫోన్ చేసినా కలవలేదు. మీ ఓఎస్డీకి ఫోన్ చేస్తే ఎప్పుడైనా…
తెలంగాణ వరి ధాన్యం కొనుగోలుపై రాద్ధాంతం నడుస్తోంది. బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ నేతల మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా వరి ధాన్యం కొనుగోలుపై తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలయింది. పిల్ దాఖలు చేశాడు లా విద్యార్థి బొమ్మనగరి శ్రీకర్. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని…