వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్టు..! హరీష్‌రావు కౌంటర్ ఎటాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.. శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడారని ఫైర్ అయిన ఆయన.. వంద ఎలుకలను తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉంది ఆయన వ్యవహారమని మండిపడ్డారు.. టీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు.. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం అయ్యావు అంటూ మండిపడ్డారు.. ఇక, నాలుగేళ్లు సీఎంగా చేస్తూ ఏం సాధించావని ప్రశ్నించిన హరీష్‌రావు.. తెలంగాణతో మీ రాష్ట్రం దేనికి పోలిక..? ఏ రంగంలో మీ రాష్ట్రం అభివృద్ధి సాధించింది..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఈ రోజే..
Also Read
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
- Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్...
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
మీరా అవినీతి కోసం మాట్లాడేది అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్‌ను నిలదీశారు హరీష్‌రావు.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని.. కానీ, మీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.. మరి మీ మధ్యప్రదేశ్ లో పెద్ద కుంభకోణం జరిగింది.. వ్యాపం కుంభకోణం సంగతి ఏంటి…? ఎవరికైనా శిక్ష పడిందా..? మనుషులనే మీరు చంపేసారు.. మీ కుంటుబ సభ్యులు, మీ పార్టీ నేతలు ఇందులో ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి.. మరి దాని సంగతి ఏంటి? అని ప్రశ్నించారు. ఇక, 317 జీవో రద్దు చేయాలా… అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా…? అని బీజేపీ నేతలపై మండిపడ్డారు హరీష్‌రావు.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా..? నిరుద్యోగులకు ఉద్యోగాలురావాలని సీఎం గారు భావిస్తుంటే, ఉద్యోగాలు రావద్దను బీజేపీ కుట్ర చేస్తోందని అని ఆరోపించారు.
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!