ఎస్సీ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీజేపీ 2023 ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. టీఆర్‌ఎస్ కి ధీటుగా పోటీ ఇచ్చేందుకు స్కెచ్ రెడీ చేస్తోంది. బీజేపీ ఎస్సీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపే కీలకం అంటున్నారు. ఎస్పీ నియోజకవర్గాల్లోని ఇతర కులాలను పార్టీ వైపు మళ్లించాలన్నారు.
అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు వ్యవహారం జాతీయ నాయకత్వం చూస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు సర్వే నిర్వహిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ ఓటు శాతం క్రమేణ పెరుగుతోంది. ప్రతి ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో కమిటీ ఒకరోజు పూర్తిగా పర్యటించాలన్నారు.
Also Read
అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 న ఎస్సీ నియోజకవర్గాల్లో ‘బహుజన పాదయాత్ర’ పేరిట కనీసం 2 నెలలపాటు పాదయాత్ర చేసేలా కార్యక్రమాన్ని రూపొందించాలని బండి సంజయ్ యోచిస్తున్నారు. ఆయా నియోజకవర్గాలలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వివరాలను గ్రామాల వారీగా సేకరించి ప్రచారం చేయాలని భావిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ ఖాళీల భర్తీ, దళిత బంధు పథకాలతోపాటు స్థానిక ఎమ్మెల్యే, స్థానిక టీఆర్ఎస్ నేతల అక్రమాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేలా ఈ సమన్వయ కమిటీ పనిచేయాలన్నారు.
తాజావార్తలు
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!