తెలంగాణ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్రవిమర్శలు చేశారు. ఫామ్ హౌస్ లో ఉన్న కెసిఆర్ ను బీజేపీ గళ్ళ పట్టి గుంజుతేనె బయటకు వచ్చాడన్నారు. జైలుకు పోతానన్న భయంతోనే దేశంలో కెసిఆర్ తిరుగుతున్నాడు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ కు ఇంటిపోరు ఎక్కువైంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అమలు చేసి తీరుతాం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరు. లాఠీలు కొనటానికి.. కొత్త జైళ్ళు…
వాళ్లంతా అధికారపార్టీని కాదని వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగొచ్చేస్తారని ప్రచారం ఊపందుకుంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యేకు టెన్షన్ పట్టుకుందట. పైకి ధీమాగా కనిపిస్తున్నా.. వారొస్తే తన పరిస్థితి ఏంటనే లెక్కల్లో ఉన్నారట ఎమ్మెల్యే. అది ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మెల్యే సురేందర్‌లో గుబులు?ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్నట్టుగా రకరకాల ప్రచారాలు షికారు చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్‌ను వీడి వెళ్లిన పలువురు…
ఎన్నో ఆశలతో బీజేపీలో చేరిన నాయకులు పక్కచూపులు చూస్తున్నారా? పార్టీ పెద్దలు పిలిస్తే.. ముందు ఆ సంగతి తేల్చాలని డిమాండ్ చేస్తున్నారా? కాషాయ శిబిరంలో చర్చగా మారిన ఆ అంశం ఏంటి? కమలనాథులను ఏ సమస్య కలవరపెడుతోంది? బీజేపీలో అభ్యర్థులపై క్లారిటీ లేదుఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామన్నది వారి వాదన. ఈ విషయంలో పైకి ఎన్ని చెప్పినా కమలనాథుల్లో అంతర్గతంగా మరో చర్చ…
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల హామీని నిలబెట్టుకోలేకపోయారంటూ టీఆర్‌ఎస్ శ్రేణులు శనివారం నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్ కార్యకర్తలతో ఘర్షణకు దిగి రాళ్లతో దాడి చేయడంతో ధర్పల్లి మండలంలో విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. ధర్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఎంపీ అరవింద్ వస్తున్నారని తెలుసుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని టీఆర్ఎస్…
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కారణం అయ్యాయి. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రధాని మోడీ కాదు కేడీ అన్నారు. ప్రధాన మంత్రికి ఉన్న గౌరవం పోయింది. కనకపు సింహాసనమున శునకము కూర్చుందని దుయ్యబట్టారు. దేశానికి ప్రధాన మంత్రి ఉన్న ఏ ఒక్క రాష్టానికి న్యాయం చేయలేదు. 7 ఏళ్లలో కేంద్రం నుంచి రెండు రాష్ట్రాలకు ఒక్క నయాపైసా ఇవ్వలేదు. తలుపులు బిగించి…
తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తప్పుబట్టడంపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ తప్పుపట్టడం సిగ్గు చేటు. ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? పార్లమెంట్ తలుపులు మూసి, మైకులు బంద్ చేసి కనీస చర్చల్లేకుండా తెలంగాణ బిల్లు పెట్టిన మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రే…
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. అయితే, గులాబీ పార్టీ నేతలు మాత్రం రెండు పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూనే వున్నారు. సూర్యాపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బడుగుల అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని, ఆయన ముట్టుకుంటే భస్మం అవుతారని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. కాళేశ్వరం కల సాకారం చేసిన…
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ గుండా రాజకీయాలను ప్రోత్సహిస్తూ దాడులకు తెగబడుతుందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురువేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పై విమర్శల దాడులకు దిగారు. తెలంగాణలో రాజ్యాంగం అమలు కావడం లేదని.. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా తెలంగాణలో పాలన సాగుతుందని విమర్శించారు. Read Also: నా ఎలక్షన్ అఫిడవిట్ పై అనవసర…
దళితులపై చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మాదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధుపై కాంగ్రెస్, బీజేపీ అనవసర విమర్శలు చేస్తున్నాయన్నారు. దళితులపై బీజేపీ ప్రేమ కల్లబొల్లి మాటల్లోనే తప్ప చేతల్లో చేసిందేమి లేదని హరీష్ రావు అన్నారు. దళిత బంధు వంటి పథకాన్ని దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని.. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చేలా పథకాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో దళితులకు ఎక్కువ నిధులు కేటాయించాలని…
ఆయనో మాజీ ఎంపీ. ఎక్కడ ఎన్నికలు జరిగినా జోస్యం చెప్పేస్తారు. ఎవరి బలం ఏంటో ముందే ప్రకటించే ఆయన.. తాను ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పార్టీలు అప్రమత్తం అవుతుంటే.. ఆ మాజీ ఎంపీ మాత్రం సైలెంట్. ఎందుకలా? ఎవరా మాజీ ఎంపీ? కొండాతో కలిసి సాగడానికి సాహసించడం లేదా?మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకసారి కాంగ్రెస్ అధినాయకత్వంపై విమర్శలు చేస్తారు. మరోసారి బీజేపీ పథకాలు, కార్యక్రమాలపై…