తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మరికొద్దిరోజుల్లో కొలిక్కి రానుంది. ఆశావహులు కేసీఆర్ ని ప్రసన్నం చేసుకుని పదవులు పొందేరు. చాలామటుకు ఎమ్మెల్సీ పీట్లు ఏకగ్రీవం అయ్యాయి. మరికొన్నింటికి డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పెద్దల సభకు వెళ్ళాలనుకునేవారి కల సాకారం అయింది. ఇందులో చాలామంది రెండుసార్లు ఎమ్మెల్సీ సీట్లు పొందారు. పదవులు రానివారు నామినేటెడ్ పదవుల వైపు మొగ్గుచూపుతున్నారు. 2014లో తెలంగాణ కల సాకారం అయ్యాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి రెండోసారి…
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఏర్పడింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుంది. మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. చెదురుమదురు ఘటనలు మినహా నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక పరిశీలన, ఉపసంహరణ మిగిలింది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను టీఆర్‌ఎస్ మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. నామినేషన్ల గడువు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అడుగడుగునా బండిని అడ్డుకోవడం.. వాగ్వాదాలు, తోపులాటలు, రాళ్ల దాడులు, కోడిగుడ్లు విసరడం లాంటి ఘటనలు చర్చగా మారాయి.. అయితే.. ఈ పరిణామాలపై స్పందించిన రైతు బంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ధాన్యం సేకరణపై పాలసీ చెబితేనే బండి సంజయ్‌ని తిరగనిస్తాం అన్నారు.. బండి సంజయ్‌ను తెలంగాణ రైతుల తరపున వెంటాడతాం… వేటాడుతామన్న ఆయన.. నల్గొండ రైతులపై దాడులు చేసిన…
తెలంగాణలో టీఆర్‌ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ సోయం బాపురావ్. ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఓటమి తట్టుకోలేక వరి ధాన్యం పై రాద్దాంతం చేస్తున్నారని, కేంద్రం వరి ధాన్యం కొనము అని ఎక్కడా చెప్పలేదన్నారు. టీఆర్‌ఎస్ నేతలు బజార్ రౌడీల్లా మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీని బదనాం చేయడం కోసం తప్ప రైతులకు మేలు చేసే ఆలోచన టీఆర్ఎస్ కు లేదు. రైతుల మీద ప్రేమ…
ప్రభుత్వం.. పార్టీల మధ్య పోరాటం కాదు.. ఇది ప్రభుత్వాల మధ్య యుద్ధం.. రైతు పండించిన పంట కల్లాలు, మార్కెట్ యార్డ్‌లు, చివరకు రోడ్లపై కూడా ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తుంది.. కానీ, గిట్టుబాటు ధర చెల్లించి రైతు నుంచి పంటను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి… పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. మొత్తం వడ్ల చుట్టే తిరుగుతోంది రాజకీయం… వడ్ల పండించాలని ఒకరు, పండించవద్దని మరొకరు.. ఇలా రైతులను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.. వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని కేంద్రంలో…
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వరిపై మొదలైన మాటల యుద్ధం సవాళ్లు విసురుకునే దాకా వెళుతోంది. యాసంగి ధాన్యం సంగతేంటని ప్రశ్నించిన టీఆర్ఎస్.. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలకు పిలుపు ఇచ్చింది. నేడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు ప్లాన్ చేశారు. రాష్ట్రం పట్ల మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. పంజాబ్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కేంద్రం నుంచి స్పష్టత వచ్చే…
యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారింది పరిస్థితి.. ఈ వ్యవహారంలో కేంద్రంపై సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్‌లో కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర బీజేపీ నేతల వరకు అంతా కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో.. కేంద్రం వైఖరి ఏంటి? రాష్ట్ర విధానం ఏంటి? అనే దానిపై గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది.. అయితే, యాసంగి ధాన్యం కొంటామని బీజేపీ నేతలు అధికారికంగా ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్ చేశారు…
హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం ఆగిపోతుందనుకుంటే.. వాటి తీవ్రత మరింత పెరిగింది.. సీఎం కేసీఆర్ ఎంట్రీతో హీట్ మరింత పెరిగింది.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కేంద్ర ప్రభుత్వం, మంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ ఇలా.. అన్ని విషయాలను తూర్పారబడుతున్నారు సీఎం కేసీఆర్.. అయితే, బీజేపీ నేతలు కూడా అదేస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, ఇవాళ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర…
తెలంగాణ సీఎం కేసీఆర్ భారత్-చైనా సరిహద్దుల్లో జరుగుతోన్న పరిణామాలపై చేసిన వ్యాఖ్యలును తప్పుబడుతోంది భారతీయ జనతా పార్టీ.. కేసీఆర్‌పై దేశద్రోహి కింద కేసు నమోదు చేయొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. మెదక్ జిల్లా చేగుంటలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్‌లో హిమాచల్‌ప్రదేశ్ లో తోకముడిచిన సైన్యం అని మాట్లాడారని.. దీంతో.. కేసీఆర్‌ను దేశద్రోహి కింద కేసు చేయొచ్చు…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి సత్తా చాటారు ఈటల.. అయితే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్-బీజేపీ మధ్య గట్టి పోటీ జరిగినా.. కాంగ్రెస్ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. గత ఎన్నికల్లో ఏకంగా 60 వేలకు పైగా ఓట్లు వస్తే.. ఈ సారి మాత్రం చతికిలపడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ, పీసీసీ చీఫ్.. ఇలా మరికొందరి నేతలపై…