తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.. నిన్న హైదరాబాద్ బీజేపీ సభలో ప్రశంగించిన శివరాజ్ సింగ్ చౌహాన్.. సీఎం కేసీఆర్ దమమున్నోడు అనుకున్నాను.. కానీ, ఇంతభయస్తుడు అనుకోలేదని ఎద్దేవా చేసిన ఆయన.. బండి సంజయ్‌ను జైల్లో పెట్టారంటేనే కేసీఆర్ ఎంతగా భయపడ్డారో అర్ధం అవుతుందన్నారు.. కేసీఆర్ అన్యాయ పాలనకు అగ్గి పెట్టేవరకూ విడిచిపెట్టం అంటూ హెచ్చరించారు.. అయితే, అదే స్థాయిలో చౌహాన్‌పై కౌంటర్ ఎటాక్ చేశారు మంత్రి గంగుల కమలాకర్..
Read Also: డీజీపీకి చంద్రబాబు లేఖ.. అతడికి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి..
సీఎం కేసీఆర్ ఆదేశిస్తే శివరాజ్ సింగ్ చౌహాన్‌కు భయం అంటే ఏంటో చూపించేవాళ్లమని హెచ్చరించారు గంగుల కమలాకర్.. టీఆర్ఎస్ తలచుకుంటే నీ విమానం హైదరాబాద్‌లో దిగేదా ? నీవు తిరిగి వెళ్లేవాడివా? అంటూ ఫైర్ అయిన ఆయన.. శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మేం అతిథిగా భావించాం.. అతిథి అనుకున్నాం కాబట్టే ఏమి అనలేదు… లేకపోతే భయం అంటే ఏమిటో మధ్యప్రదేశ్ సీఎంకి చూపించేవాళ్లం అన్నారు. కేసీఆర్ పై నిన్న వచ్చిన సీఎంగాని… ఇవాళ వచ్చిన సీఎంగాని… ఎవరుగాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరని.. నిరసన తెలుపుతారని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీకి పంజాబ్‌లో తగిలిన నిరసన కంటే ఎక్కువ నిరసన సెగ చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు మంత్రి గంగుల కమలాకర్.