బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీఎల్పీ నేత రాజాసింగ్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. తన నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మీతో చర్చించాలని అపాయింట్ మెంట్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరడం లేదన్నారు. సభలో మీరు గతంలో ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను.
నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను కలవవచ్చని, మాట్లాడవచ్చన్నారు. అసెంబ్లీ కార్యక్రమాల తర్వాత వందల సార్లు మీతో మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ కుదరలేదు. మీకు ఫోన్ చేసినా కలవలేదు. మీ ఓఎస్డీకి ఫోన్ చేస్తే ఎప్పుడైనా ఒకటే సమాధానం. సార్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించి చెబుతానన్నారు. కానీ ఇప్పటివరకూ అపాయింట్ మెంట్ లభించలేదు.
గోషామహల్ అభివృద్ధికి మీరు సమయం కేటాయించండి. ఎంఐఎం లీడర్ల తరహాలో నేను ప్రభుత్వ భూముల సెటిల్మెంట్ల కోసం మిమ్మల్ని కలవడంలేదు. మునిసిపల్ అభివృద్ధి మంత్రిగా నా నియోజకవర్గం గురించి మీరు ఆలోచించాలి. ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధుల మొర ఆలకించండి అంటూ ట్వీట్ చేశారు.