తెలంగాణలో అధికారపార్టీ టీఆర్ఎస్‌లో ఒక్కసారిగా వేడి పుట్టింది. దీనికి కారణం రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్ రావడమే. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్‌ను రాజీనామా చేయించి.. ఎమ్మెల్సీని చేశారు. దీంతో ఆ రాజ్యసభ స్థానానికి 2024 ఏప్రిల్ వరకు పదవీకాలం ఉండిపోయింది. ఆ భర్తీ ప్రక్రియలో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దాంతో టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థి ఎవరు అనే అంశం చుట్టూ చర్చ ఊపందుకుంటోంది. రెండేళ్లే పదవీకాలం ఉన్నప్పటికీ చాలామంది టీఆర్‌ఎస్ నేతలు…
తెలంగాణ అంతటా ఒకతీరు… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకతీరు. ఖమ్మం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా వుంటాయి. గతంలో ఎంపీగా పనిచేసిన ఆయన గత కొంతకాలంగా స్తబ్ధంగా వున్నారు. మళ్లీ తాజాగా ఆయన పేరు బాగా వినిపిస్తోంది. ఆయనను గులాబీ అధినేత పెద్దల సభకు పంపుతారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సీఎంవో నుంచి కాల్ వచ్చిందని పదవి ఇస్తామని చెప్పినట్లుగా .. ఇక నామినేషన్ వేయడమే తరువాయి అని అంటున్నారు. నామినేషన్ తేదీ.. నామినేషన్…
మున్నూరు రవికి ప్లీనర్ ఎంట్రీ పాస్ ఎవరు ఇచ్చారు? మున్నూరు రవి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేసిన కేసులో కీలక నిందితుడు. అలాంటి వ్యక్తి టీఆర్‌ఎస్ ప్లీనరీలో ప్రత్యక్షమయ్యాడు. టీఆర్ఎస్ పార్టీ పండక్కి వెళ్లాలని ఎంతోమంది గులాబీ కార్యకర్తలు ప్రయత్నించినా.. నియోజకవర్గాల నుంచి కొందరినే ఎంపిక చేశారు. వారికే ఆహ్వానాలు వెళ్లాయి. ఎమ్మెల్యేలు పంపిన జాబితాను వడపోసి.. లిమిటెడ్‌గానే ఇన్విటేషన్లు పంపారు నేతలు. ప్లీనరీకి వచ్చేవాళ్లకు బార్‌కోడ్‌తో కూడిన పాస్‌లు ఇచ్చారు. ప్లీనరీ ప్రాంగణంతోపాటు.. ప్లీనరీ…
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటున్నారు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముందస్తు ఎన్నికల పొత్తు పెట్టుకున్నట్లు దాదాపు అధికారిక సమాచారం అన్నారు. నిన్న సీఎం కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ మధ్య జరిగిన భేటీ, ఆ తర్వాత ప్రకటనలు కేసీఆర్, సోనియాగాంధీ మధ్య పొత్తు ఖాయమని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కూటమిపై బీజేపీ పోటీ చేయనుంది. 1+1 సున్నాగా మారుతుందని నేను…
టీఆర్ఎస్‌కు పట్టున్న నియోజకవర్గాల్లో దుబ్బాక ఒకటి. గులాబీ పార్టీ నుంచి సోలిపేట రామలింగారెడ్డి వరసగా విజయం సాధిస్తూ వచ్చారు. అంతకుముందు ఈ నియోజకవర్గం దొమ్మాటగా ఉండేది. అప్పుడు కూడా సోలిపేట రెండుసార్లు గెలిచారు. గత ఏడాది సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ తరఫున రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమితో సుజాత కొద్దిరోజులు సైలెంట్ అయ్యారు. కానీ.. ఇప్పుడిప్పుడే ఆమె యాక్టివ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో…
సొంత జిల్లాలో మంత్రి ఒంటరయ్యారా? పార్టీ సీరియస్‌గా ఫైట్ చేస్తున్న అంశంలో మంత్రితో జిల్లాలోని అధికారపార్టీ ఎమ్మెల్యేలు కలిసి రాలేదా? ఏక్ నిరంజన్‌గానే కార్యక్రమం నడిపించేశారా? జిల్లాలో గ్రూపుల గోలపై పార్టీ వర్గాలకు క్లారిటీ వచ్చేసిందా? ఇంతకీ ఎవరా మంత్రి? జిల్లాలో మంత్రితో కలిసిరాని ఎమ్మెల్యేలు మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరికి వారుగా విడిపోయి గ్రూపులు కట్టారు. ఎప్పట్నుంచో జిల్లాలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి కార్యక్రమం నిర్వహించే పరిస్థితి…
తెలంగాణలో ఒక్క జిల్లాలో టీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు ఎక్కువగా వుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు తార స్థాయికి చేరింది. ఏకంగా జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై దాడికి స్వపక్షీయులే దాడి చేయడానికి ప్రయత్నించారు. మోటార్ బైక్ ను డీ కొట్టేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే సమస్యను పరిష్కరించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి కోసం ఎదురు చూసిన…
అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రమంతా ఒకతీరు… ఖమ్మం జిల్లాలో ఒకతీరు మాదిరిగా వుంది. నేతలు వర్గాలుగా చీలిపోయి అస్థిత్వం కోసం పోరాటం చేస్తూ వుంటారు. తాజాగా పోటాపోటీగా చేసిన కార్ల ర్యాలీలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం కందుకూరు గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి వేరువేరుగా చేరుకుని విజేతలకు బహమతులను ప్రధానం చేశారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ…
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్‌ఎస్ కూడా భగ్గుమంటోంది. టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు మోడీపై ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు. 187వ నిబంధన కింద టీఆర్‌ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో…
ఈనెల 31 నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కరోనా నేపథ్యంలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలను నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో…