బీజేపీపై టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, టీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఎన్నికల కౌంటింగ్ అవ్వకముందే బీజేపీ అవాకులు చెవాకులు మాట్లాడుతోందిని రంజిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల కౌంటింగ్ ఎందుకు ఆలస్యం అవుతుందని మేము అడుగుతున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రరంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది.
ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మొత్తం మునుగోడు ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి.. బైపోల్‌లో నామినేషన్ల పర్వ కొనసాగుతుండగా.. ఉప ఎన్నికల పర్వం కీలక స్థాయికి చేరుకున్న వేళ అధికార టీఆర్‌ఎస్ పార్టీకి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఈ ఎన్నికలో కారును పోలిన గుర్తులు ఏకంగా ఎనిమిది ఉన్నాయి.. గతంలోనే కారును పోలిన గుర్తులతోనే కొన్ని నియోజకవర్గాల్లో దెబ్బతిన్న గులాబీ పార్టీ.. ఇప్పుడు ఎన్నికలకు ముందే మోల్కోంది.. ఎన్నిక గుర్తుల జాబితాలో కెమెరా, చపాతీ రోలర్, డాలీ, రోడ్…