తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడంతా కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ చుట్టే తిరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ దసరా రోజున ఏర్పాటు చేసే జాతీయ పార్టీ విజయవంతం కావాలని భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, బస్వరాజు సారయ్య. పూజల్లో పాల్గొన్నారు కుడా ఛైర్మన్ సుందర్ రాజ్, వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి. కెసిఆర్ జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు వరంగల్ టీఆర్ఎస్ నేతలు.
Read Also: Srihan: ‘ఆవారా జిందగీ’తో అలరించే యత్నం..!!
ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. విజయదశమి రోజున సిఎం కేసిఆర్ ఏర్పాటు చేసే జాతీయ పార్టీ సక్సెస్ అవుతుంది. పార్టీ పేరు ఎజెండా రేపు సీఎం కేసిఆర్ ప్రకటిస్తారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని పూజలు నిర్వహించాం. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రాణించేలా శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను. రేపు ప్రత్యేక పూజలు నిర్వహించి కేసిఆర్ కు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేస్తాం. కెసిఆర్ జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటే కొందరు అనవసరమైన విమర్శలు చేస్తున్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయానికి మహర్దశ రానుంది. 30 కోట్లతో రాజగోపురం, మాడవీధుల నిర్మాణం చేపడుతున్నాం అన్నారు వినయ్ భాస్కర్.
Read Also: Dussehra Fight: చిరూ.. ఈ సారి ఏమవుతుంది!?