మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు పాల్పడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ బీజేపీ నేతలు అడ్డంగా బుక్కైన వ్యవహారం తెలంగాణను షేక్ చేస్తోంది. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్‌ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే దురాలోచనతో అడ్డదార్లు ఎంచుకుంది. ఈ క్రమంలోనే డబ్బు ఆశ చూపి టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసి పోలీసులకు దొరికిపోయింది. చండూర్ లో ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. అంగట్లో సరుకులా రాజగోపాల్ రెడ్డిని కొనవచ్చు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరన్నారు బాల్క సుమన్. నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేసింది. ఆపరేషన్ ఆకర్ష్ వల విసిరింది.
వీరు భారీగా డబ్బులు ఎర వేసేందుకు ప్రయత్నిస్తూ హైదరాబాద్‌లో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఇప్పటివరకు రూ.15 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి అజీజ్ నగర్‌లోని పీవీఆర్ ఫామ్ హౌస్‌లో కోట్లలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీపీఐ నేత కూనమనేని సాంబశివరావు మాట్లాడుతూ.. బీజేపీపై మండిపడ్డారు.
బీజేపీ రోజు నీతి మాటలు చెప్తుంది. చేసేదేమో చీకటి వ్యవహారం.. మత పెద్దలను ముందు పెట్టి MLAలను కొనుగోలు చేయడం అంటే బీజేపీ ఆలోచన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. దేశమంతా బిజెపి ఇదే చేస్తుంది. మెజార్టీ లేని చోట కూడా ఎమ్మెల్యే లని కొనుగోలు చేసి అధికారం చేజిక్కించుకుంటుందని మండిపడ్డారు.ఏక్ నాథ్ షిండే తరహాలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారని, తెలంగాణలో ఇలాంటి ఆటలు సాగవన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కులగొట్టాలి అని ఆకునున్న బీజేపీ కుట్రను మా ఎమ్మెల్యేలు బయపెట్టారు. షిండే అలాంటి వారిని తయారు చేయాలనుకునే మీ ప్రయత్నాలు తెలంగాణ నెరవేరవు. ఈ కుట్రలు కుతంత్రాలు.. అపకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు..గతంలోను కొందరు టిఆర్ఎస్ కులగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు కూడా వీగిపోయి బీజేపీ మా ఎమ్మెల్యేలను కొనడం సాధ్యం కాదన్నారు. ఈ వ్యవహారంతో మునుగోడులో భారీ మెజారిటీ సాధిస్తామన్నారు. 50 వేల మెజారిటీ తథ్యం అన్నారు వినయ్ భాస్కర్.
ఇదంతా పక్కా సినిమా స్టోరీ.. డీకె అరుణ
ఇదిలా వుంటే.. ఇదంతా కేసీఆర్ సృష్టించిన సినిమా స్టోరీ అని కొట్టిపారేశారు బీజేపీ నేత డీకె అరుణ. చిల్లర రాజకీయాలు చేయడంలో దిట్ట. చిన్నపిల్లలు కూడా ఇలాంటి కథ చెప్పరు. వాళ్ళ ఎమ్మెల్యేకి చెందిన ఫాం హౌస్ లో ఇలా జరుగుతుందా? మునుగోడు లో ఓడిపోతామనే ఈ చిల్లర రాజకీయాలు చేశారన్నారు. ఇది మీరు చేయకపోతే.. యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేయాలన్నారు డీకె అరుణ.
Read Also: BIG Breaking: నలుగురు TRS ఎమ్మెల్యేలకు వల.. పోలీసుల భారీ ఆపరేషన్