ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మొత్తం మునుగోడు ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి.. బైపోల్‌లో నామినేషన్ల పర్వ కొనసాగుతుండగా.. ఉప ఎన్నికల పర్వం కీలక స్థాయికి చేరుకున్న వేళ అధికార టీఆర్‌ఎస్ పార్టీకి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఈ ఎన్నికలో కారును పోలిన గుర్తులు ఏకంగా ఎనిమిది ఉన్నాయి.. గతంలోనే కారును పోలిన గుర్తులతోనే కొన్ని నియోజకవర్గాల్లో దెబ్బతిన్న గులాబీ పార్టీ.. ఇప్పుడు ఎన్నికలకు ముందే మోల్కోంది.. ఎన్నిక గుర్తుల జాబితాలో కెమెరా, చపాతీ రోలర్, డాలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులు.. తమ పార్టీ గుర్తు కారును పోలి ఉన్నట్టు చెబుతోన్న టీఆర్ఎస్ నేతలు.. ఆ గుర్తులను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను విజ్ఞప్తి చేశారు.. ఇవాళ టీఆర్‌ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, భానుప్రసాదరావు, భరత్ కుమార్ తదితర నేతలు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
Read Also: Andhra Pradesh: ఏపీ విద్యాశాఖలో తొలిసారి ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టు
మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తు ను పోలిన ఎనిమిది గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను కోరింది టీఆర్ఎస్ ప్రతినిధి బృందం.. అయితే, ఎన్నిక గుర్తుల జాబితా నుంచి ఆ 8 గుర్తులను తొలగించాలని విజ్ఞప్తి చ ఏసిన నేతలు.. దీనిపై 48 గంటల్లో స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే సీఎం కేసీఆర్ పై క్షుద్రపూజలంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై చర్యల తీసుకోవాలని సీఈఓ కి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ సింబల్ ను పోలిన 8 గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని సీఈవోను కోరాం.. గతంలో కారును పోలిన సింబల్స్ తో స్వల్ప మెజార్టీతో మా అభ్యర్థులు ఓడిపోయారు.. అందుకే అలాంటి 8 గుర్తులను తొలగించాలని కోరామని తెలిపారు.
ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మండిపడ్డారు వినయ్ భాస్కర్.. సంజయ్ కి పిచ్చి లేసిందన్న ఆయన.. దేవుడితో సమైనమైన సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. ఆయనకు పిచ్చి లేసింది.. ఇష్టం వచ్చినట్లు కుక్క లెక్క మొరుగుతున్నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఆయన పద్ధతి మార్చుకునేలా లేడు. అందుకే ఎన్నికలకు కమిషన్‌ణు కలిసి ఫిర్యాదు చేశాం.. ఆయన పిచ్చి కుక్క కంటే అద్వాన్నంగా తయ్యారు అయ్యాడు… వాళ్ల పార్టీకి తెలంగాణలో రోజురోజుకు ఆదరణ తగ్గడంతో ఇలా వ్యవహారం చేస్తున్నాడని విమర్శించారు దాస్యం వినయ్ భాస్కర్.