కేవలం హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే జల దోపిడీ తెరపైకి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పటివో అయినా.. ఈ మధ్య తరచూ విమర్శలు, ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… మీకు నిజాయితీ ఉంటే అక్రమంగా చేపట్టిన ఆర్డీఎస్ పనులను ఆపాలని డిమాండ్ చేశారు.. ఆర్డీఎస్ పై అవగాహన లేని బచ్చాగాళ్లు ముఖ్యమంత్రి రాసిచ్చిన కాగితాలు చూసి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయిన ఆమె.. ఆంధ్రవాళ్లు అని విమర్శించే వారు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది మీ ముఖ్యమంత్రి కాదా? అని ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరులో ప్రాజెక్టుల సాధన.. నా కృషి వల్లే అనేది ముందు తెలుసుకోవాని సూచించిన డీకే అరుణ.. నేను పాలమూరు కోసం చేసిన కృషి మీకేం తెలుసు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, ఏడేళ్లుగా జల దోపిడీని అడ్డుకోలేని వారు.. ఇవాళ కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికలు ఉన్నాయని మాత్రమే జల దోపిడీ గురించి మాట్లాడుతున్నారని.. కేవలం ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు డీకే అరుణ. పాలమూరు, నీళ్ల పేరు చెప్పుకుని ఉద్యమాన్ని నడిపించి పాలమూరు ప్రజలను మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అంటూ మండిపడ్డ ఆమె.. పాలమూరు జిల్లా కోసం మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు.. కృష్ణ జలాలు పెద్ద ఎత్తున వృథా అవుతున్నా దాని గురించి మాట్లాడరు.. గత ప్రభుత్వాల మీద నిందలు వేస్తూ ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తూ పరిపాలన సాగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ డ్రామాలు ఆపి ముందు ఆంధ్రప్రదేశ్ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపండి అంటూ డిమాండ్ చేశారు డీకే అరుణ.
Also Read
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!