కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో తెరాస పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శీను కన్సిలర్ లతో ఈటల పై ప్రెస్ మీట్ పెట్టారు. గత రెండేళ్ల నుండి పార్టీకి అతీతంగా మాట్లాడుతున్న ఈటల మాటలతో పార్టీకి దూరమైనవు అని అన్నారు. ప్రగతి భవనంలో కేసీఆర్ సమయం ఇవ్వకపోతే ఆత్మగౌరవం అడ్డొచ్చిందా అని అడిగిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో పనులమీద ఉంటాడు. మిమ్ములను స్వంత కుటుంబ సభ్యునిగా,తమ్మునిగా చూసుకున్న కెసిఆర్ మీకు ఏమి తక్కువ చేశారని అడుగుతున్నాం అన్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టి గొర్రెల మందలపై తోడేళ్ళు పడ్డట్టు అన్న మాటలను మేము వ్యతిరేకిస్తున్నాం. మేము గొర్రెల మందలం కాదు,మేము ఎలాంటి ప్రలోభాలకు వెళ్ళలేదు. టిఆర్ఎస్ ఆవిర్భావం నుండి మేము ఉంటున్నాం మా నాయకుడు కెసిఆర్, మేము కెసిఆర్ వెంటే, టిఆర్ఎస్ పార్టీ లొనే ఉంటాం అని చెప్పారు.