Infiltrators: అక్రమ బంగ్లాదేశీలపై త్రిపుర ఉక్కుపాదం, టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..
- బంగ్లాదేశీ చొరబాట్లపై కఠిన చర్యలు ప్రారంభించిన త్రిపుర..
- బంగ్లాదేశీయుల్ని బహిష్కరించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infiltrators: అక్రమంగా తమ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులపై పలు ఈశాన్య రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, అస్సాం, త్రిపురతో పాటు చాలా ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశీ చొరబాటుదారులతో విసిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు వీరిని బహిష్కరించేందుకు చర్యల్ని ప్రారంభించాయి. ఇప్పటికే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించి, వారు ఆక్రమించిన స్థలాలను విముక్తి చేస్తున్నారు.
Read Also: Pakistan: పాకిస్తాన్ నిజస్వరూపం ఇది.. పహల్గామ్ దాడి ఉగ్రసంస్థకు మద్దతు..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇదిలా ఉంటే, తాజాగా త్రిపుర రాష్ట్రం కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల్ని గుర్తించి, వారిని బహిష్కరించేందుకు పశ్చిమ త్రిపుర జిల్లా ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌తో త్రిపుర 856 కి.మీ సరిహద్దును పంచుకుంటోంది. సరిహద్దు జిల్లాల్లో ఈ చొరబాట్లు ఎక్కువగా ఉన్నాయి. పశ్చిమ తి్రిపు జిల్లాలోని మొత్తం 15 పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అధికారులు ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఉంటారు. ఈ టాస్క్ ఫోర్స్‌కు జిల్లా ఇంటెలిజెన్స్ డీఎస్పీ దేబాసిష్ సాభా నేతృత్వం వహిస్తారు.
“త్రిపురలోకి ప్రవేశించే వారి సంఖ్య తగ్గినప్పటికీ చొరబాటుదారులను గుర్తించడానికి SIT ఏర్పాటు చేయబడింది” అని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అన్నారు. రాష్ట్రంలో బిజెపి కీలక మిత్రపక్షమైన తిప్రా మోతా పార్టీ (TMP), అక్రమ వలసదారుల గుర్తింపు, నిర్బంధం, బహిష్కరణకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. చొరబాట్లు రాష్ట్ర స్థానిక ప్రజలు, ముఖ్యంగా గిరిజనుల ఆచారాలు, సామాజిక-ఆర్థిక అభివృద్ధిపై ప్రభాం చూపిస్తుందని టీఎంఫీ పార్టీ ప్రద్యోత్ దేబ్బర్మ గతంలో అన్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!