Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అఘాయిత్యాలు పెరిగాయి. హిందూ నేతల అరెస్టులు, హిందువుల ఆలయాలు, ఆస్తులు, వ్యాపారాలు, ఇళ్లపై మతోన్మాద మూక దాడులకు తెగబడుతోంది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ అక్కడి అరాచకాలను కంట్రోల్ చేయలేకపోతున్నాడు. మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా వంటి సంస్థలు మైనారిటీలు ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తున్నాయి.
Read Also: IPL 2025: లక్నో కెప్టెన్ పంత్, పూరనా..? సంజీవ్ గోయెంకా ఆన్సర్ ఇదే
ఆ ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌కి భారత్ షాక్ ఇచ్చింది. త్రిపుర రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని బంగ్లాదేశ్‌ని కోరింది. రూ. 135 కోట్ల విద్యుత్ బకాయిలను క్లియర్ చేయాలని కోరింది. బంగ్లాదేశ్‌లోని బ్రహ్మణబారియా జిల్లాలో శనివారం ఢాకా మీదుకు ప్రయాణిస్తున్న అగర్తలా-కలకత్తా బస్సుపై దాడి జరిగిన తర్వాత ఈ చర్య వచ్చింది. బస్సుపై దాడి చేసి భారత వ్యతిరేక నినాదలు చేశారు.
త్రిపుర విద్యుత్ శాఖ మంత్రి రతన్ లాల్ నాథ్ మాట్లాడుతూ.. 35 కోట్లు బకాయి ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్ క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తోంది. ప్రతి యూనిట్ విద్యుత్‌కు, మేము రూ. 6.65 వసూలు చేస్తున్నాము, ఇది మనకు లభించే దానితో పోలిస్తే మంచి రేటiని ఆయన అన్నారు. ఇలాంటి సమస్య రావడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్, బంగ్లాదేశ్ రూ. 100 కోట్ల కంటే ఎక్కువ బకాయిలు ఉండటంతో విద్యుత్ సరఫరాని పరిమితం చేసింది. ఒక ఏడాదిగా బంగ్లాదేశ్ చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు పెరిగిపోయాయి. ఒప్పందం ప్రకారం.. బంగ్లాదేశ్ త్రిపుర నుంచి 160 మెగావాట్ల కరెంట్‌ని పొందే అర్హత ఉంది. ఈ ట్రేడింగ్‌ని ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్(ఎన్వీవీసీ) పర్యవేక్షిస్తోంది.