Triple Talaq: మహారాష్ట్రలోని థానేలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి ఓ వింత కారణంతో తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. తన భార్య ఒంటరిగా వాకింగ్‌కు వెళ్తుందనే కారణంతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తన భార్య తండ్రికి ఫోన్ చేసి ఆ యువకుడు తెలిపాడు. దీంతో సదరు వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక, అతనిపై ఇండియన్ జస్టిస్ కోడ్ సెక్షన్ 351(4) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Release Clash : బాలయ్య తో పోటీపడుతున్న మెగా హీరోలు
అయితే, ట్రిపుల్ తలాక్ కింద, భర్త ఈమెయిల్ లేదా టెక్స్ట్ మెసేజ్‌తో సహా ఏదైనా ఫార్మాట్‌లో మూడుసార్లు ‘తలాక్-తలాక్-తలాక్’ అని చెప్పి భార్యకు విడాకులు ఇవ్వొచ్చు. ఈ ట్రిపుల్ తలాక్ విధానాన్ని 2017లో సుప్రీంకోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించింది. కాగా, 2019 జూలై 30న ట్రిపుల్ తలాక్ బిల్లును భారత పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లును ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) బిల్లు, 2019 అని కూడా పిలుస్తారు.