సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది.. పేదలను నాశనం చేయడానికే వైసీపీ పుట్టింది అని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతం కానీ.. గత ప్రభుత్వ హయాంలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.
Indiramma Indlu : తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల పట్ల ప్రత్యేక దృష్టితో పథకాలు అమలవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, పేదలు నివసించే ప్రాంతాల్లో జీవనోపాధికి ఆటంకం లేకుండా జీ+3 మోడల్‌లో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఆదివాసీలకు నివాస హక్కు కల్పించడమే కాకుండా, వారు జీవించేందుకు అవసరమైన వనరులను అందుబాటులో ఉంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇక పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు పథకం కార్యరూపం దాల్చనుంది. REDMAGIC 10S…
Minister Seethakka : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి కొండా సురేఖతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అటవీ పరిసర గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా అటవీ శాఖ నిబంధనల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చ జరిగింది. ఈ సమన్వయ సమావేశానికి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అటవీశాఖ ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, ఐటిడిఎ అధికారులు హాజరయ్యారు. మంత్రి సీతక్క…
అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ‘నల్లమల డిక్లరేషన్’ను సైతం ఆవిష్కరించారు. ఈ డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం నల్లమల ప్రాంతం గురించి సీఎం ప్రసంగించారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం. ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారని నాటి రోజులను సీఎం గుర్తు చేశారు. సీఎంగా ఇక్కడి నుంచి…
దేశానికి ఇందిరా గాంధీ లాంటి పౌరుషం ఉన్న ప్రధాని కావాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 50 ఏండ్ల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇందిరమ్మ ఉందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు.
తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా ఉన్న దున్నేవాడిదే భూమి నినాదాన్ని ఇందిరా సౌర గిరి జిల్లా వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై ఉన్న నినాదాలు చట్టాలుగా మారాలంటే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు.
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్‌కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ.12,600 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇందిరా గిరి జల వికాస పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. పథకం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా 23 మంది చెంచు గిరిజన రైతులకు సౌర ప్యానెళ్లు , సోలార్ పంపు సెట్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అంతకుముందు, సీఎం రేవంత్ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి…
CS Ramakrishna Rao: నేడు (మే 13) సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక, గిరిజన, మైనారిటీ వసతి గృహాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలోని వివిధ సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ వసతి గృహాలలో మెరుగైన సేవలు అందించడానికి తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు సీఎస్ రామకృష్ణారావు. విద్యార్ధులకు అందించే కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపులను నేరుగా విద్యార్ధుల బ్యాంక్ అకౌంట్…
Minister Seethakka : తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘ఆపరేషన్ కగార్’పై కేంద్ర ప్రభుత్వం తన పట్టును కొనసాగిస్తూ, 20వేల మంది భద్రతా సిబ్బందితో కర్రిగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులను పట్టుకునేందుకు గట్టి పోరాటం చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా, సీఆర్‌పీఎఫ్ (CRPF) దళాలు బుధవారం కర్రిగుట్టపై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. అయితే, అక్కడ పర్మినెంట్ బేస్ క్యాంపుల ఏర్పాటు కోసం భద్రతా దళాలు సన్నాహాలు…