ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడు గ్రామస్థులందరికీ చెప్పులు పంపిణీ చేశారు. ఇటీవల "అడవితల్లి బాట" అనే కార్యక్రమంలో భాగంగా పవన్ ఆదివాసీ గ్రామం పెదపాడులో పర్యటించిన విషయం విదితమే. ఆ సమయంలో పాంగి మిథు అనే వృద్ధురాలు పవన్‌కళ్యాణ్ కోసం నడిచి వచ్చి స్వాగతం పలికారు.
SP Shabarish : ములుగు జిల్లా కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు బాంబులు పెట్టినట్టు మంగళవారం ఓ లేఖ ద్వారా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ గారు స్పందించారు. ప్రజల్లో భయం కలిగించే ప్రయత్నాల్లో భాగంగా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులకు మాత్రం ఇది సరైన మార్గం కాదని స్పష్టం చేశారు. అడవుల్లో నివసిస్తూ తమ జీవనోపాధిని సాగిస్తున్న ఆదివాసీలపై ఈ విధమైన బెదిరింపులు న్యాయసమ్మతం కావని ఎస్పీ…
ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ భాగస్వామి అయ్యాడంటే.. ప్రతీ గిరిజన యువకుడు ప్రభుత్వంలో వున్నట్టే లెక్క అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇక్కడ ప్రజల ఆవేదన, బాధ తెలుసుకోవడం కోసమే అటవీ ప్రాంతంలో పర్యటించామన్నారు. రూ.105 కోట్లతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
అక్కడ బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ షాకులిస్తోందా? ఒకదానివెంట ఒకటిగా ఇంకా ఇవ్వడానికి స్కెచ్చేస్తోందా? ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసిన ఓ బలమైన వర్గం మీద ఫ్రష్‌గా ఫోకస్ పెట్టిందా? ఆ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే.... ఏం జరుగుతుందో లోక్‌సభ ఎన్నికల్లో జ్ఞానోదయం అయిందా? ఇప్పుడు ఎక్కడ కొత్తగా ప్యాచ్ వర్క్ మొదలుపెట్టింది హస్తం పార్టీ? ఆ ఎఫెక్ట్ ప్రతిపక్షాల మీద ఎలా ఉండబోతోంది?