ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ అనంతరం పలు విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరుతోపాటు.. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు.. ఇంత ఘోర ప్రమాదం జరిగినప్పటికీ కొందరు ఎలా బ్రతికి బయటపడ్డారనే విషయాలు అధికారుల పరిశీలనలో వెలుగు చూస్తున్నాయి.
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన పశ్చిమబెంగాల్ వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభవార్త చెప్పారు. మరణించిన వారి కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో కాగ్ నివేదికలను ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జను ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
Indian Railways: రైల్వేశాఖ తీసుకున్న ఓ నిర్ణయం గత ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది.. సీనియర్ సిటిజన్ల టికెట్లపై రాయితీని రద్దు చేయడం ద్వారా రైల్వే శాఖకు అదనపు ఆదాయం సమకూరింది. రాయితీ రద్దు మూలంగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,242 కోట్లు అదనంగా ఆర్జించినట్లు రైల్వే శాఖ పేర్కొంది.. ఆర్టీఐ దరఖాస్తుకు జవాబిస్తూ రైల్వే శాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.. అయితే, కరోనా మహమ్మారీ ఎంట్రీ తర్వాత.. దేశంలో పరిస్థితి…
రేషన్ మాఫియా రూట్ మార్చిందా..? చిన్నచిన్న వాహనాల్లో అయితే ఈజీగా దొరికేస్తామని ఏకంగా రైళ్లలోనే అక్రమ రవాణాకు తెగిస్తున్నారా..? రాష్ట్ర సరిహద్దులు లేదా జిల్లా సరిహద్దుల్లో గోదాముల్లో నిల్వ చేసి రాత్రికి రాత్రే రాష్ట్రాలు దాటిస్తున్నారా..? అంటే అవుననే స్పష్టం అవుతోంది.. కొమురం భీం జిల్లా సిర్పూర్ టి రోడ్డు రైల్వే స్టేషన్ మీదుగా పీబీఎస్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అందించే పీడీఎస్ బియ్యాన్ని కొందరు దళారులు అక్రమమార్గం…
Indian Railways: రైళ్లలో ఐదేళ్లలోపు చిన్నారులకు కూడా టికెట్ తీసుకోవాలంటూ వస్తున్న వార్తలను రైల్వేశాఖ ఖండించింది. రైళ్లలో ప్రయాణించే చిన్నారుల టికెట్ బుకింగ్ విషయంలో ఎలాంటి మార్పులు ప్రకటించింది. ఒకటి నుంచి ఐదేళ్ల వయస్సు గల పిల్లలకు పెద్దలకు వర్తించే టికెట్ ధరలు వర్తిస్తాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఐదేళ్ల లోపు పిల్లలందరూ గతంలో తరహాలోనే రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సూచించింది. అయితే ప్రత్యేకంగా బెర్త్ లేదా సీట్ కేటాయించడం…
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. వాల్తేర్ డివిజన్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈనెల 6న సోమవారం నాడు విజయవాడ-విశాఖ మార్గంలో ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దు చేసిన రైళ్లలో కాకినాడ పోర్ట్-విశాఖపట్నం (రైలు నంబర్ 17267), విశాఖపట్నం-కాకినాడ పోర్టు (రైలు నంబర్ 17268), విజయవాడ-కాకినాడ పోర్టు (రైలు నంబర్ 17257), కాకినాడ పోర్టు-విజయవాడ (రైలు నంబర్ 17258), విజయవాడ-రాజమండ్రి (రైలు నంబర్ 07768),…