వారాంతాల్లో ఎంఎంటీఎస్ సేవల్లో కోత విధించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు 34 సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది . మొత్తం 16 సర్వీసులు నడుస్తుండగా… అందులో 34 సర్వీసులు అంటే సగం వరకూ సర్వీసులను రద్దు చేసినట్టయ్యింది. ఆయా రైళ్ల రద్దు వివరాలను నగరంలోని అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలో అందుబాటులో ఉంచుతున్నారు. రద్దైన మార్గాలుః లింగంపల్లి – హైదరాబాద్ మధ్య 18 సర్వీసులు రద్దయ్యాయి. ఫలక్ నుమా…
ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.. దీంతో విద్యుత్ వినియోగానికి భారీగా డిమాండ్ పెరిగింది.. కానీ, డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరాను అందించే పరిస్థితి లేకుండా పోయింది.. అది కాస్తా విద్యుత్ కోతలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో కరెంటు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు తరలింపు ప్రక్రియను వేగవంతం చేసింది.. దీనికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రైలు సర్వీసులను…
ప్రస్తుతం అమెరికాలో మంచు భీభత్సం సృష్టిస్తోంది. మంచు తుపాన్ కారణంగా లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. రైలు పట్టాలపై మంచు పేరుకుపోవడంతో అనేక రైళ్లు రద్దయ్యాయి. అయితే, చికాగో రైల్వే అధికారులు దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలను కనిపెట్టారు. మంచుకారణంగా రైలు పట్టాలు కుంచించుకుపోయి రైళ్ల రాకపోకలు ఇబ్బందులు కలుగుతుండటంతో రైళ్ల పట్టాలపై మంటలను ఏర్పాటు చేశారు. దీంతో పట్టాలు వెచ్చగా మారి రైళ్ల రాకపోకలకు అనువుగా మారుతున్నాయి. అయితే, ఇవి…
1850 దశకంలో రైళ్లు దేశంలో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. రైళ్ల గురించి మనందరికీ తెలుసు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే రైళ్ల గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. రైళ్లలో గేర్లు ఉంటాయనే సంగతి చాలా మందికి తెలియదు. రైళ్లలో చాలా గేర్లు ఉంటాయి. ఈ గేర్లను నాచ్ అని అంటారు. ఇంజన్‌లో మొత్తం 8 నాచ్‌లు ఉంటాయి. ఎనిమిదో నాచ్‌లో సుమారు 100 కిమీ వేగంతో ప్రయాణం…
నగరాల ప్రజలకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణం సులువు అయిపోయింది.. దూరంతో సంబంధం లేకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటున్నారు.. అయితే.. బెంగళూరులో మెట్రో రైలు సేవలు మరింత తొందరగా ప్రారంభం కానున్నాయి.. మరింత లేట్ నైట్ వరకు సాగనున్నాయి.. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అవుతోన్న మెట్రో రైలు సేవలు.. శనివారం నుంచి గంట ముందుగానే.. అంటే ఉదయం 5 గంటల నుంచే ప్రారంభం కానున్నాయని ప్రకటించింది…
రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. ఎందుకంటే సౌత్ వెస్ట్రన్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు అయితే.. మరికొన్ని దారి మళ్లించారు అధికారులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా బెంగళూరు వెళ్లే కొన్ని రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది సౌత్ వెస్ట్రన్ రైల్వే .. యలహంక – పెనుకొండ మధ్య డబ్లింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా.. ఈ నెల 12, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్…
జవాద్ తుఫాన్ దూసుకొస్తుండడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు.. ఈస్ట్ కోస్ట్ రైల్వేతో పాటు దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏకంగా 120 రైళ్లను రద్దుచేసినట్టు అధికారులు వెల్లడించారు.. ఈ నెల 2వ తేదీ నుంచి కొన్ని రైలు సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే కాగా.. నిన్న కూడా కొన్ని రైళ్లు పట్టాలు ఎక్కలేదు.. ఇవాళ కూడా మరికొన్ని రైళ్లు స్టేషన్లకే పరిమితం కానున్నాయి. ఈ నెల…
ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యింది… కుండపోత వానలు.. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరదలతో రాయలసీమ, కోస్తాఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.. అయితే, ఇప్పుడు మరో తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది.. ఇప్పటికే ఆ తుఫాన్‌కు ‘జవాద్ తుఫాన్’గా నామకరణం చేశారు అధికారులు.. అండమాన్ నికోబార్ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారబోతోంది.. జవాద్ ఎఫెక్ట్‌తో ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. అయితే,…
సంక్రాంతి పండుగ అంటే పిల్లలు పెద్దలకి ఎంతో సరదా. ఉద్యోగాలు, పిల్లల చదువుల కోసం వేరే ఊళ్లలో వుండేవారు స్వంతూళ్ళకు వెళతారు. బంధువులు, కుటుంబ సభ్యులతో వారం గడిపేస్తారు. పాత రోజుల్ని గుర్తుచేసుకుంటారు. గోదావరి జిల్లాల వారైతే కోడిపందేలతో మజా చేస్తారు. సంక్రాంతి వంటకాలతో కడుపారా తింటారు. గతంలో కంటే ఈసారి సంక్రాంతి సందడి ఎక్కువగానే వుండేలా వుంది. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్ళుగా సంక్రాంతిని ఎంజాయ్ చేయలేనివారు ఈసారి సంక్రాంతికి ఊరెళదామనుకుంటున్నారు. అయితే, సంక్రాంతి పండక్కి…
విశాఖ జిల్లా అరకు వెళ్లే రైలు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొత్తవలస-కిరండోల్ మార్గంలో చిమిడిపల్లి 66వ కి.మీ. వద్ద కొండ రాళ్లు జారి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. విద్యుత్ లైన్‌పైనా బండ రాళ్లు పడటంతో విద్యుత్ వైర్లు తెగిపడిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు కొండరాళ్లను తొలగించేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్తవలస-కిరండోల్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అరకు, బొర్రా గుహలు వెళ్లేందుకు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు…