హైదరాబాద్ లో వాహన రద్దీ నెలకొంది. ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగర వాసులు బయలు దేరారు. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు పయణమవుతున్నారు.
రోజువారీ రైల్వే ప్రయాణికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైల్వే వందే మెట్రో రైలును నడపనుంది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మెట్రో మార్గంలో నడిచే ఈ రైళ్లు మొదటి దశలో దేశంలోని 124 నగరాలను కలుపుతాయి. జూలై నుంచి తొలి వందే మెట్రో రైలు పట్టాలపై నడుస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు వల్ల చల్లని గాలులు వీస్తున్నాయి. దీని వల్ల ఢిల్లీ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే, పొగమంచు వల్ల విజిబిలిటీ తక్కువగా ఉంది.. ఈ పొగమంచు వల్ల పలు రైళ్లు రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు కురిసింది. దీంతో.. 194 విమానాలు, 22 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 3.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది ఈ సీజన్ లో కనిష్ట ఉష్ణోగ్రత. ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయం ప్రాంతంలో విజిబిలిటీ జీరో మీటర్లుగా ఉంది. కాగా.. ఢిల్లీ విమానాశ్రయం గత రాత్రి పొగమంచు హెచ్చరికను జారీ చేసింది. ప్రయాణీకులు విమానాల గురించి తాజా…
గుంటూరు రైల్వేస్టేషన్‌లో మూడు రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. నరసాపురం నుంచి హుబ్లీకి, గుంటూరు నుంచి విశాఖకు, రేణిగుంట నుంచి నంద్యాలకు మూడు రైళ్లను కేంద్రమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు రైళ్లను ప్రారంభించామని, నంద్యాల నుంచి రేణిగుంట రైలు తిరుమల భక్తులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందని తెలిపారు
Many trains canceled on Wednesday in AP: ‘మిచాంగ్’ తుపాను ఏపీలోని పలు జిల్లాలను కుదిపేసింది. తుపాను ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు, 80-110 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతో ఏపీలోని పట్టణాలు, పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రోడ్లపై మోకాళ్ల లోతుకు పైగా నీళ్లు ఉండడంతో…
కొత్తవలస కిరండోల్ రైలు మార్గంలో కొండచరియలు విరిగిడ్డంతో పట్టాలు తప్పింది గూడ్స్ రైలు ఇంజన్.. శివలింగపురం యార్డ్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.. దీంతో, కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి
దీపావళి/ఛత్ పూజా సీజన్లో, రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మరియు ప్రయాణీకుల అదనపు రద్దీని అధిగమించడానికి దక్షిణ మధ్య రైల్వే సాధారణ, రోజువారీ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైలు ప్రయాణీకుల ప్రయోజనం కోసం జోన్లోనే కాకుండా జోన్ వెలుపలి గమ్యస్థానాలకు కూడా ప్రత్యేక రైళ్లు నడపబడుతున్నాయి.