ఏపీలో ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు భారీగా నిధులు మంజూరు చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మేయర్ భాగ్యలక్ష్మి, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. దుర్గమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించిన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాను.. అమ్మవారిని ప్రపంచంలో అనేక రకాలుగా వాతావారణం, అనుకూలం లేని పరిస్దితులు, కరోనా నుండి బయటపడ్డాం మరలా ఇలాంటి పరిస్థితులు రాకుడదని కోరుకున్నానన్నారు.
Read Also: MP Margani Bharat: శభాష్ భరత్.. గోదావరిలో దూకబోయిన యువకుడిని కాపాడిన ఎంపీ
రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని కోరుకున్నాను..గతంలో వృద్ధులు మాత్రమే దేవాలయాలకు వచ్చేవారు నేడు యువతంతా దేవాలయాలకు వస్తున్నారు.అమ్మవారు సమస్త ప్రజలను దయతో చూడాలని కోరుకున్నా.. ప్రసాద్ టూరిజం లో భాగంగా అమరావతికి వచ్చే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాం..అన్నవరం, సింహాచలం, నెల్లూరు లక్ష్మి నరసింహ దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాం..దేశంలో 156 దేవాలయాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల మేరకు అభివృద్ధి చేస్తున్నాం. ఘంటశాల శతాబ్ది ఉత్సవాలు రాజమండ్రిలో నిర్వహించాం. విజయవాడలో త్వరలో నిర్వహిస్తాం అన్నారు కిషన్ రెడ్డి.
ఇటు ధర్మవరం నుంచి విజయవాడ నడుస్తున్న రైలు నం. 17216 ను మచిలీపట్నం వరకు పొడిగించాలని నిర్ణయించింది రైల్వేశాఖ. విజయవాడ రైల్వే జంక్షన్ లో ధర్మవరం -మచిలీపట్నం రైలును జండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విజయవాడ రైల్వే స్టేషన్ ను ఎయిర్ పోర్ట్ లా ఆధునీకరించబోతున్నాం. రాజమండ్రి, గూడూరు రైల్వేస్టేషన్ లను త్వరలో ఎయిర్ పోర్ట్ లా ఆధునీకరిస్తామన్నారు. ఏపీ నుంచి హైదరాబాద్ కు రైళ్లలో వచ్చే ప్రయాణికులు ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారి కోసం చర్లపల్లి వద్ద కొత్త రైల్వే టర్మీనల్ ను నిర్మిస్తున్నాం అన్నారు. వచ్చే డిసెంబర్ లోపల 100 వందేభారత రైళ్లను తీసుకొస్తామని చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
Read Also: A village without TV: ఆ ఊరిలో ఏ ఇంట్లోనూ టీవీ ఉండదు