Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జలగావ్‌లోని పరండా రైల్వే స్టేషన్ దగ్గర ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయనే భయంతో ప్రయాణికులు ట్రాక్‌పైకి దూకారు. అదే సమయంలో ట్రాక్ పై నుంచి వెళ్తున్న బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగులు అక్కడిక్కడే మరణించారు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో చైన్ లాగడంతో మంటలు చెలరేగినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
తమిళనాడులో మంగళవారం ఉదయం రైలు ప్రమాదం తప్పింది. పుదుచ్చేరికి వెళ్తున్న మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. విల్లుపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారి తెలిపారు. లోకో పైలట్ దానిని చూసి వెంటనే రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మూడు గంటల్లోనే రైలు రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. పట్టాలు తప్పడానికి గల కారణాలు విచారణ పూర్తయిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు.…
పల్నాడు జిల్లాలో తృటిలో రైలు ప్రమాదం తప్పింది.. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం రైల్వే గేటు వద్ద పట్టాలు తప్పింది గూడ్స్ రైలు... నడికుడి నుండి పొందుగుల మధ్యలో ఈ ఘటన జరిగింది..
West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. సౌత్-ఈస్ట్రన్ రైల్వే ప్రకారం.. B1 సహా మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి.
హర్యానాలోని జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. రోహ్‌తక్‌లోని సంప్లా పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురైదుగురికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి. దూకడం వల్ల కొందరు గాయపడ్డారు. మంటల కారణంగా కోచ్ మొత్తం పొగతో నిండిపోయి నల్లగా మారింది.
Train Accident: ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై 15 మీటర్ల పొడవైన హైటెన్షన్ వైర్ పడి ఉండడాన్ని డెహ్రాడూన్- తనక్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్లు గుర్తించి అత్యవసరంగా రైలును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది.
తమిళనాడు రాష్ట్రంలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూర్- దర్భంగా భాగమతి ఎక్స్ ప్రెస్ చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్ దగ్గర గూడ్స్ రైలును ఢీ కొట్టింది. రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 18 రైళ్లను క్యాన్సిల్ చేసింది.
చెన్నైలో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్ళూరు జిల్లా కవారిపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిలబడి ఉన్న గూడ్స్‌రైలును ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలుపురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎక్స్‌ప్రెస్ రైలులోని రెండు కోచ్‌లు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం తెలుస్తోంది.
నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్ రైలు.. 5వ లైన్‌పై రైలు నిలిచిపోయింది.. దీంతో.. పట్టాల పైనుంచి పక్కకు ఒరిగాయి చివరి 5 బోగీలు.. అయితే, రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు..