Train Accident: ఉత్తరాఖండ్‌లో రైల్వే ట్రాక్‌పై హైటెన్షన్ వైర్.. తప్పిన పెను ప్రమాదం
- ఉత్తరాఖండ్‌లో తప్పిన పెను ప్రమాదం..
- ఖతిమా రైల్వే స్టేషన్‌ను సమీపంలో రైల్వే ట్రాక్ పై తెగిపడిన హైటెన్షన్ వైర్..
- హైటెన్షన్ వైర్ ను గుర్తించి రైలును ఆపేసిన డెహ్రాడూన్- తనక్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Accident: ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై 15 మీటర్ల పొడవైన హైటెన్షన్ వైర్ పడి ఉండడాన్ని డెహ్రాడూన్- తనక్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్లు గుర్తించి అత్యవసరంగా రైలును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున ఖతిమా రైల్వే స్టేషన్‌ను సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై అప్రమత్తమైన రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌పై ఉన్న వైర్‌ను తొలగించడంతో రైలు ముందుకు వెళ్లింది.
Read Also: Diwali Celebration Date Controversy: దీపావళి ఏ రోజు జరుపుకోవాలి..? పంచాంగ కర్తల మధ్య వివాదం..
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
ఇక, ఈ విషయానికి సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ఉత్తరాఖండ్ పోలీసుల సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సంఘటనపై భారతీయ న్యాయ్ సంహిత్ (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద గుర్తు తెలియని నిందితులపై కేసు కూడా నమోదు చేశారు. అయితే, ఖతిమా స్టేషన్‌లోని స్టేషన్ మాస్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రాడూన్-తనక్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ స్టేషన్ నుంచి వెళ్లిన కాసేపటికే లోకో పైలట్‌లు రైలును నిలిపివేసి.. తమకు సమాచారం అందించారని చెప్పుకొచ్చారు. తక్షణమే సంఘటన ప్రదేశానికి వెళ్లి ఆ హైటెన్షన్ వైర్ ను తొలగించి ట్రైన్ ముందుకు వెళ్లేలా చేశామన్నారు. అయితే, ఈ ఘటనకి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
Read Also: Telangana: గురుకుల పాఠశాలలకు తాళాలు.. బయటే టీచర్లు, విద్యార్దుల నిరీక్షణ..
కాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రైలు పట్టాలపై ఇనుప రాడ్లు, సిలిండర్లు, సిమెంట్ దిమ్మెలను ఉంచడం వంటి చర్యలు తరచుగా చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో లోకో పైలట్లు అప్రమత్తతో అనేక ప్రమాదాలను నిరోధించగలిగారు. అలాగే, రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు రైల్వే ట్రాకులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!