గుజరాత్‌లో మరో రైలు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం సూరత్ సమీపంలో అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు ట్రైన్ రన్నింగ్లో ఉండగానే ఊడిపోయాయి. కాగా.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
విశాఖ రైలు ప్రమాదంపై విచారణను వేగవంతం చేశారు. అగ్నిప్రమాదంలో దగ్ధమైన బోగీలను సాంకేతిక బృందాలు పరిశీలించాయి. ఆర్.డీ.ఎస్.ఓ, ఐ.సీ.ఎఫ్ బృందాలు సమగ్రంగా విచారణ జరుపుతున్నాయి. క్లూ్స్ టీమ్ కూడా ఆధారాల సేకరణలో నిమగ్నమైంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హీట్ హీట్ గా కొనసాగుతున్నాయి. ఈరోజు లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చించారు. ఈ సందర్భంగా.. ఏఐఎంఐఎం (AIMIM) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం, జార్ఖండ్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం సహజమే.. కానీ తరచూ జరిగే రైలు ప్రమాదాలను సాధారణ సంఘటనగా పేర్కొనలేమని ఆయన అన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ తప్పిదం ఉందని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడంలో…
జార్ఖండ్‌లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో హౌరా- ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో.. మూడు బోగీలు చెల్లాచెదురై పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడిపోయాయి. అయితే.. అదే ట్రాక్ పై వచ్చిన హౌరా-ముంబై రైలు ఆ బోగీలను ఢీకొట్టగా మొత్తం 18 ప్యాసింజర్ ట్రైన్ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురికి…
జార్ఖండ్ రాష్ట్రం చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్‌లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైల్వేలోని మూడు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 6 మందికి గాయాలైనట్లు సమాచారం.
Train Accident : బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్ నుండి ఢిల్లీకి వెళుతుండగా దాని కప్లింగ్ లింక్ తెగిపోయింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కు వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ (15904) ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని జిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.
Train Upper Berth: కేరళకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి రైలు కోచ్‌లో ప్రయాణిస్తుండగా రాంగ్ వే చైనింగ్ కారణంగా పై బెర్త్ సీటు పడిపోయి ప్రయాణికుడు మరణించాడు. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్‌పి) బుధవారం ఈ సమాచారాన్ని అందించారు.
Kanchenjunga Accident : పశ్చిమ బెంగాల్‌లో సోమవారం జరిగిన కాంచన్‌జంగా రైలు ప్రమాదానికి సంబంధించి గూడ్స్ రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గార్డులను దోషులుగా నిర్ధారించారు.