Moosarambagh Bridge : మూసారాంబాగ్ ప్రాంతంలో పాత బ్రిడ్జిని కూల్చివేయడానికి జీహెచ్ఎంసి అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, కొత్త హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఇంకా పూర్తికాకముందే పాత బ్రిడ్జిని కూల్చివేయడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. గతంలో వచ్చిన వరదలలో దెబ్బతిన్న ఈ బ్రిడ్జి, ఇంజనీరింగ్ విభాగం ప్రకారం వాహనాల రాకపోకలకు సురక్షితం కాదని తెలుసుకున్నప్పటికీ, స్థానికుల అభ్యర్థనలను పక్కన పెట్టి ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు చెప్పుతున్నదాని ప్రకారం.. అంబర్‌పేట్ నుంచి…
అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను లారీ ఢీకొట్టింది. భార్యాభర్తలు స్పాట్‌లోనే మృతి చెందారు. తూప్రాన్ పేట్ కు చెందిన భార్యాభర్తలు వెంకటేష్, లక్షీగా పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాలను పోస్టు మర్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా ప్రాంతంలో మరోసారి మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంతో అక్కడ జొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే, సకాలంలో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక అధికారులు. సమాచారం ప్రకారం.. కుంభమేళా ప్రాంతంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం వల్ల పెద్దగా నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మేళాకు వెళ్లే ప్రధాన రహదారిలోని సెక్టార్ 2 సమీపంలో ఆగి ఉన్న…
BRS : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే. తారక రామారావు (కేటీఆర్) నేతృత్వంలో నల్గొండలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రాజకీయ వాతావరణంలో కలకలం రేగింది. జనవరి 21న జరగాల్సిన ఈ మహాధర్నాకు చివరి నిమిషంలో అనుమతి రద్దయింది. పోలీసుల నిర్ణయంతో బీఆర్ఎస్ నాయకత్వం హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ధర్నాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు…
Flights Diversion : కృష్ణా జిల్లాను పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport) వద్ద కూడా భారీగా పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. పొగమంచు కారణంగా క్లియరెన్స్ లేక గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద పలు విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. పొగమంచు కారణంగా సుమారు గంట నుంచి ఫ్లైట్స్ గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల…
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులు నీట మునిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.