Maha Kumbh Mela 2025: కుంభమేళా ప్రాంతంలో మళ్లీ మంటలు.. రెండు వాహనాలు దగ్ధం
- మహాకుంభమేళా ప్రాంతంలో మరోసారి అగ్ని ప్రమాదం.
- ప్రమాదంలో రెండు వాహనాలు దగ్ధం.
- మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా ప్రాంతంలో మరోసారి మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంతో అక్కడ జొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే, సకాలంలో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక అధికారులు. సమాచారం ప్రకారం.. కుంభమేళా ప్రాంతంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం వల్ల పెద్దగా నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మేళాకు వెళ్లే ప్రధాన రహదారిలోని సెక్టార్ 2 సమీపంలో ఆగి ఉన్న రెండు వాహనాల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో చాలా సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
Also Read: Dead Body On Bicycle: సైకిల్‌పై 15 కి.మీ. తల్లి మృత దేహాన్ని మోసుకెళ్లిన కొడుకు
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
అయితే, ఘటన నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం. ఏకాదశి కావడంతో ఈరోజు మహాకుంభానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. గతంలో జరిగిన అగ్నిప్రమాదం దృష్ట్యా కుంభ్ నిర్వాహకులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అగ్నిప్రమాదాలు, ప్రమాదాల నివారణకు కుంభమేళాలో పలు చోట్ల స్పాట్‌లు ఏర్పాటు చేశారు. తద్వారా ఏదైనా సంఘటన జరిగితే సత్వరమే స్పందించవచ్చు.
Also Read: Mamatha Kulakarni: మహా కుంభమేళాలో సన్యాసం తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్..
ఈ కారణంగా, ఈ ఉదయం అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో అగ్నిమాపక దళం సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే కారులోని వ్యక్తులను ఖాళీ చేయించి మంటలను అదుపులోకి తెచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని, వాహనాలను ఇక్కడే పార్క్ చేశారని ఫైర్ ఆఫీసర్ విశాల్ యాదవ్ తెలిపారు. అయితే ఇక్కడ విపరీతమైన వేడి కారణంగా మంటలు చెలరేగాయని, అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయని తెలిపారు. ఈ ఘటనలో ఓ ఎర్టిగా కారు పూర్తిగా, ఓ వెన్యూ కారు పాక్షికంగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!