ఆగస్టు 9 క్విట్ ఇండియా దినం నుంచి తెలంగాణ విలీన దినం సెప్టెంబర్ 17 వరకు 40 రోజుల పాటు ఈ ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం చేపట్టాలి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపాడు. డీసీసీలు ఈ విషయంలో చాలా సీరియస్ గా పని చేయాలి. ఈ విషయంలో సామాజిక కోణం ఉంది. నియోజక వర్గాల వారీగా నివేదికలు తయారు చేయాలి. బాగా పనిచేసిన వారిని పార్టీ గుర్తిస్తుంది. 119 నియోజక వర్గాలకు ఇంచార్జి కు ఎలా పని చేశారో వారి పనితీరుకు ఇదో కొలబద్ద అని అన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేసిన వారి పనితీరు తోనే పార్టీ బాగు పడుతుంది. 17 పార్లమెంట్ లో ప్రత్యేక నివేదికలు తయారు చేస్తాం. ఏ స్థాయిలో పనిచేస్తున్న నాయకులు అయినా నియోజక వర్గంలో వారి పనితీరు పైన నివేదిక ఇవ్వాలి.
ఇక మండలాల అధ్యక్షుల పనితీరు బాగుండాలి. వారు గట్టిగా పనిచేస్తే నియోజకవర్గంలో గెలవడం సులువు. మండల అధ్యక్షలు మండల అధికారుల నుంచి పని చేయించగలగాలి. పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో నాయకులు చురుగ్గా ఉండాలి. నియోజక వర్గంలో ఉన్న నాయకలుకు సమన్వయ కర్తలు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. రాష్ట్రంలో కార్యకర్తలు గట్టిగా పని చేస్తున్నారు. నాయకులు కూడా గట్టిగా కొట్లాడాలి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉంది. నాకు ఉన్న రాజకీయ అవగాహన ప్రకారం కాంగ్రెస్ కచ్చితంగా 72 సీట్లు గెలుస్తుంది అని పేర్కొన్నారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. ఎవరు ఆపలేరు అని కూడా తెలిపారు.