ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామం శివారులో ఉన్న బొగత జలపాతం పర్యాటకులను అట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు బొగత జలాపాతం పరవళ్లు తొక్కుతోంది. జలసవ్వడులు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి బొగత జలపాతం సందర్శనకు పర్యటకులకి అనుమతి ఇచ్చారు అధికారులు. ములుగు జిల్లా వాజేడు మండలం బోగత జలపాతం సందర్శనకు పర్యాటకులను షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు అటవీ అధికారులు.
Also Read:AP Government: అదానీకి షాక్..! ఆ ప్లాంట్లు రద్దు చేసిన ఏపీ సర్కార్..
గత 10 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చి ప్రమాద స్థాయిని దాటి ప్రవహించడంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా అనుమతి నిరాకరించారు. నిన్నటి నుంచి జలత ప్రవాహం కొద్దిగా తగ్గు ముఖం పట్టడంతో జలపాతం సందర్శనకు అనుమతులు ఇచ్చారు అధికారులు. కానీ ఏ సమయంలో ప్రవాహం పెరుగుతోందో తెలియనందున నీటి కొలనులోకి పర్యాటకుల అనుమతి నిరాకరించారు అధికారులు.