దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.114కి చేరడంతో వాహనాలలో పెట్రోల్ పోయించాలంటే మిడిల్ క్లాస్ ప్రజల జేబులు ఖాళీ అయిపోతున్నాయి. అయితే పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నుంచి ప్రజలు ఉపశమనం పొందాలంటే ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సజ్జనార్ ఆ ట్వీట్‌లో కోరారు. అంతేకాకుండా హీరో మహేష్ బాబు…
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు తెరుచుకుంటున్నాయి. పర్యాటక రంగం తెరుచుకోవడంతో టూరిస్టులు భారీ సంఖ్యలో పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. దీంతో పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరుగుతున్నది. పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరగడం వలన కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, జనవరి-ఏప్రిల్ మధ్యకాలంలో కేసులు తీవ్రస్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు. సామాజిక, రాజకీయ, మతపరమైన కారణాలతో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడితే దాని వలన కేసులు పెరుగుతాయని…
రోదసి యాత్రలో మరో సువర్ణాద్యాయం మొదలైంది. ఇటీవలై ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నలుగురు సామాన్య టూరిస్టులను స్పేస్ ఎక్స్ సంస్థ రోదసిలోకి పంపింది. భూకక్ష్యలో ఈ క్యాప్సుల్ మూడు రోజుల పాటు భూమిచుట్టూ పరిభ్రమించి ఈరోజు సురక్షితంగా భూమిమీదకు చేరింది. ఇందులో ప్రయాణం చేసిన నలుగురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారని స్పేస్ ఎక్స్ పేర్కొన్నది. ఈ క్యాప్యూల్ అట్లాంటిక్ మహాసముద్రంలో పారాచూట్ సహాయంతో ల్యాండ్ అయింది. నిపుణులైన వ్యోమగాములు లేకుండా సాధారణ ప్రయాణికులతో ఈ…
ప్రపంచంలో పురాతనమైన కట్టడాలు ఏవి అంటే పిరమిడ్‌లు అని చెప్తారు. ఈజిప్ట్ లో ఉన్న ఈ పిరమిడ్ లను సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు వస్తుంటారు. ఇక ఈజిప్టు రాజధాని నగరం కైరోకు దక్షిణ ప్రాంతంలోని సక్కార పిరమిడ్ ఉన్నది. ఈ పిరమిడ్ లో 4700 సంవత్సరాల నాటి సమాధి ఉన్నది. ఇది కింగ్ జోజర్ సమాధి. క్రీస్తుపూర్వం 2667-2648 మధ్యాకాలంలో నిర్మించి ఉంటారని చరిత్రను బట్టి తెలుస్తున్నది. కైరోను సందర్శించే టూరిస్టులు ఈ సమాధిని…
ప్రతి ఆదివారం రోజున సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్‌బండ్ రోడ్లను మూసేస్తున్నట్లు ఇప్పటికే పోలీసు అధికారులు ప్రకటించారు. కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతించేందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మార్గంలో ప్రయాణం చేసే వాహనాలను దారిమళ్లించనున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణం చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. సందర్శకులకు ట్యాంక్‌బండ్ చివర పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేసినట్టు ట్రాఫిక్…
కరోనా తరువాత అన్ని రంగాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. కరోనాకు కారణమైన చైనాలో పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో అన్ని రంగాలు తెరుచుకున్నాయి. పర్యాటక రంగం తిరిగి ప్రారంభమైంది. రాజధాని బీజింగ్‌లోని జూ వీకెండ్స్‌లో పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం రోజున పెద్దసంఖ్యలో పర్యాటకులు బీజింగ్ జూకు తరలి వచ్చారు. అయితే, జూలో ఉన్నట్టుండి ఇద్దరు పర్యాటకుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానలా మారి రెండు కుటుంబాల మధ్య గొడవలా మారిపోయింది. రెండు కుటుంబాలకు…
కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా బయటపడలేదు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు తిరిగి తెరుచుకోవడంతో టూరిస్టుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలకు టూరిస్టులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైని ముస్సోరిలోని కెంప్టీ జలపాతాన్ని సందర్శించేందుకు భారీగా తరలి వచ్చారు. కెంప్టీ జలపాతం కింద పర్యాటకు పోటీలుపడి మరీ స్నానాలు చేశారు. …
అందాల అరకు లోయ చాలా కాలం తరువాత పర్యాటకులతో కళకళలాడుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలను సడలిస్తూ వస్తున్నారు. ఆంక్షలు క్రమంగా సడలిస్తుండటంతో అన్ని రంగాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. మూడు నెలల క్రితం మూతపడిన పర్యాటక రంగం తిరిగి తెరుచుకున్నది. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకు వ్యాలీకి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. Read: తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ విషెష్ వారాంతపు సెలవులు కావడంతో అరకు వెళ్లి అక్కడ సేదతీరేందుకు పర్యాటకులు…
భారత్ నుంచి ఎక్కువ మంది పర్యటనల కోసం మాల్దీవులకు వెళ్తుంటారు. అలా మాల్థీవులకు వెళ్లే భారత పర్యాటకులపై ఆ దేశం తాత్కాలికంగా నిషేదం విధించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లో పర్యటించిన పర్యాటకులపై కూడా మాల్ధీవులు నిషేదం విధించింది. అన్ని రకాల వీసాలపై ఈ నిషేదం వర్తిస్తుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు ట్వీట్ చేశారు. మే 13 నుంచి ఈ నిషేదం…