పచ్చదనం పరిచిన ప్రకృతి సోయగాలు.. పక్షుల కిలకిలరావాలు.. ఎత్తునుంచి జాలువారే జలపాతాలు.. ఇవన్నీ మన్యంలో కనపడుతాయి. ప్రకృతి అందాలను చూసి తరించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Read Also: George Soros: జార్జ్ సోరోస్‌కి యూఎస్ అత్యున్నత పురస్కారం.. ఎలాన్ మస్క్ ఆగ్రహం..
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు రోజులు కావడంతో పర్యాటకులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఆనందంగా గడుపుతున్నారు. దానికి తోడు శీతాకాలంలో ప్రకృతి అందంగా కనిపిస్తుంది. మారేడుమిల్లి ప్రాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. దట్టమైన కొండల మధ్యలో చావడికోట వ్యూ పాయింట్‌కి పర్యటకులు ఎగబడుతున్నారు. ప్రతిరోజు సుమారు వేల సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. మారేడుమిల్లికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఘట్టమైన పొగ మంచుతో కూడుకుని.. ఘాట్ రూట్‌లో వెళ్తే చావడికోట గ్రామ సమీపంలో ఆహ్లాదకరమైన సన్ రైజ్ వ్యూ పాయింట్ చూసి నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు.. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంది. పర్యాటకుల ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో రిసార్ట్‌లకు డిమాండ్ పెరిగింది.
Read Also: KTR: నయవంచన, మోసం అనే పదాలు కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ..