Muthyam Dhara: ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యాంధర జలపాతాలను చూసేందుకు వెళ్లిన 160 మంది పర్యాటకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు.. 8 గంటలపాటు నీటిలో ఉంటూ కుండపోత వర్షంలో గడిపారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు అడవుల్లో ఉండే ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి 84 మంది పైగా పర్యాటకులు చిక్కుకున్నారు. పర్యాటకులు తిరిగి వస్తుండగా ఒక్కసారిగా దారిలో ఉన్న వాగు పొంగింది. దీంతో వాగు దాటలేక అడవిలోనే ఉండిపోయారు పర్యాటకులు. వారిని కాపాడేందుకు పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు.
సిక్కింలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం మధ్య భీకర కొండచరియలు విరిగిపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతికూల వాతావరణం కారణంగా, కొండచరియలు విరిగిపడటంతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హుస్సేన్ సాగర్‌లో భాగమతి బోటులో ప్రయాణించేందుకు పర్యటకులు ఇష్టపడతారు. అయితే, ఆదే ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది. నిన్న హైదరాబాద్‌లో భారీ వర్షం కరిసిన సంగతి తెలిసిందే. భాగమతి బోటులో 40 మంది పర్యాటకులు ఉరుములు, ఈదురు గాలులకు చిక్కుకోవడంతో హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద భయాందోళనలు నెలకొన్నాయి.
జమ్ము కశ్మీర్ లో రంగురంగు విరులు పర్యాటకులను కనువిందు చేశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే పర్యాటకుల సందర్శనార్థం శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ ను అధికారులు మార్చ్ 19న తెరిచారు. దీంతో రంగురంగుల పూలను వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తారు. 30 రోజుల్లో రికార్డు స్థాయిలో 3.75 లక్షల మంది తులిప్ గార్డెన్ ను సందర్శించారు.
ముంబై లోకల్ రైళ్లు ముళ్లు లేని గులాబీల మంచం లాంటివి. దేశంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున, రైల్వే స్టేషన్‌లో ప్రజల ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దీని ఫలితంగా సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో లోకల్ రైలును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గొడవ జరిగింది.
గ్యాంగ్‌టక్‌ను త్సోమ్‌గో సరస్సు మరియు నాథులా సరిహద్దులోని పర్యాటక ప్రదేశాలకు కలిపే జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌లోని మంచుతో కప్పబడిన కొండ వైపున ఫోటోలు తీస్తుండగా మంగళవారం అనేక మంది పర్యాటకులు హిమపాతంలో చిక్కుకున్నారు.
దాదాపు 400 మంది పర్యాటకులు సిక్కింలో భారీ హిమపాతం తర్వాత చిక్కుకుపోయారు. శనివారం సుమారు 100 వాహనాలు నాథులా, సోమ్‌గో సరస్సు నుంచి తిరిగి వస్తుండగా నిలిచిపోయాయి.
Tourist Police Stations: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఇప్పటికే ప్రజల రక్షణ కోసం.. ముఖ్యంగా మహిళలు, యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలకు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఇప్పుడు పర్యాటకుల భద్రతే లక్ష్యంగా మరో ముందడుగు వేసింది.. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఏపీ వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్‌లను ప్రారంభించారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇవాళ జెండా ఊపి…
గోవా వెళ్లాలని అనుకుంటున్నారా?.. ఇంతకు ముందులాగా అనుమతి లేకుండా పర్యాటకులతో సెల్ఫీలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే.. గోవా సర్కారు కొన్ని ఆదేశాలు జారీ చేసింది.