Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం.. ఏ సిటిలో జరుగుతాయంటే..
- 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం..
- అహ్మదాబాద్‌లో జరుగనున్న మెగా స్పోర్ట్స్ ఈవెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ క్రీడలు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగబోతున్నాయి. ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ కామన్‌వెల్త్ స్పోర్ట్ అహ్మదాబాద్‌ను కామన్వెల్త్ క్రీడల కోసం ఆతిథ్య నగరంగా సిఫారసు చేసింది. చివరిసారిగా 2010లో భారత్ ఈ మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్‌ను నిర్వహించింది. రెండోసారి భారత్ 2030లో ఆతిథ్యం ఇవ్వబోతోంది.
2030 కామన్వెల్త్ గేమ్స్ క్రీడలు, సంస్కృతి, ఐక్యతకు గొప్ప వేదికగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారతదేశ ఆర్థిక శక్తి, శక్తి సామర్థ్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించే అవకాశం ఉంది. భారత్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు పెంచడంతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో కొత్త తరం అథ్లెట్లకు స్పూర్తినిస్తుంది.
Also Read
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
Read Also: Off The Record: అక్కడ టీడీపీలో రేషన్ మాఫియా కలకలం..!
ఇది వందో కామెన్వెల్త్ గేమ్స్ అవుతాయి. 2036లో భారత్ ఒలింపిక్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇది ఒక ప్రారంభ కార్యక్రమంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు సంబంధించి, నవంబర్ 26, 2025న స్కాట్లాండ్‌లో జరిగే కామన్వెల్త్ స్పోర్ట్స్ జనరల్ అసెంబ్లీలో ఆమోదం పొందవచ్చు.
భారత్ లో చివరి సారిగా ఢిల్లీ వేదికగా 2010లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్ జరిగాయి. ఆ సమయంలో గేమ్స్ ప్రణాళిక లోపాలు, మౌలిక సదుపాయాల పూర్తి కాకపోవడం, అవినీతి ఆరోపణలు కారణంగా భారత ప్రతిష్ట మసగబారింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు పీటి ఉషా ఈ 100వ కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణ భారత్‌కు గర్వకారణం అని అన్నారు.
2030 గేమ్స్ కోసం రూ. 825 కోట్లతో నిర్మించిన నరన్‌పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రధాన వేదికగా ఉండనుంది. ఈ కార్యక్రమానికి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయి పటేల్ ఎన్‌క్లేవ్, నరేంద్రమోడీ స్టేడియం వంటి వాటిని కూడా ఉపయోగిస్తారు.
తాజావార్తలు
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!