‘‘హిందీ వివాదం’’.. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ కలిసే అవకాశం.. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలు, హిందీ వివాదంపై తమిళనాడు, కర్ణాటక తర్వాత మహారాష్ట్రలోని పొలిటికల్ పార్టీలు కూడా ఈ వివాదంలో చేరాయి. మహారాష్ట్రంలో హిందీ వివాదం నేపథ్యంలో ఠాక్రే కుటుంబాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల మళ్లీ కలిసిపోయేందుకు మార్గం సుగమం అయింది. మరాఠీ గుర్తింపు, సంస్కృతికి ముప్పు ఉందనే ఆందోళనల మధ్య విడిపోయిన ఇద్దరు నేతలు…
మూసి పునరుజ్జీవం చేస్తామంటే.. బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తు్న్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ లో ఉన్న తెలంగాణ వాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “తెలంగాణలో పరిశ్రమలు రావాల్సి ఉంది.. మన దగ్గర భూమి సరిపడా ఉంది.. పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాం.. గుజరాత్ లో సబర్మతి కట్టుకున్నారు.. బీజేపీ వాళ్లు డిల్లీలో యమున నది…
కాకాణిని పట్టిస్తే బహుమతి..! సోమిరెడ్డి ఆఫర్.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. గత నెలరోజులుగా పరారీలో ఉన్నారు. ఆయన కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఏపీ ఇలా తదితర ప్రాంతాల్లో పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. బంధువులు, స్నేహితుల నివాసాలపై కూడా నిఘా పెట్టారు పోలీసులు.. అయితే, కాకాణి ఆచూకీ చెబితే బహుమతి ఇస్తాను అంటూ బంపరాఫర్ ఇచ్చారు మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. మాజీ మంత్రి కాకాణి…
కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు.. ప్రజా ప్రభుత్వం పైన కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీర అయిలయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని, కేటీఆర్ వెకిలి చేష్టలతో కాళ్లలో కట్టెలు పెట్టినట్లు మాట్లాడుతున్నాడని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో..లేకుంటే నాలుక కోస్తామని, అవినీతి డబ్బుతో పెట్టిన పింకీ మీడియా తో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేస్తున్నాడని, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చుతామని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడని, రియల్టర్లు, బ్రోకర్లు, భూ స్కాం లు చేసిన వారు చందాలు…
రేపు ఈ మండలాల్లో భూ భారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభం తెలంగాణ భూ భారతి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, దీని ప్రయోజనం రాష్ట్రంలో భూ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడం , రైతులకు, పర్యావరణానికి అనుకూలంగా భూముల వినియోగాన్ని ప్రోత్సహించడం. ఈ కార్యక్రమం, తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్, భూమి చట్టాలు, ఆస్తి హక్కుల పునరుద్ధరణ వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తుంది. భూ భారతి కార్యక్రమం ద్వారా, ప్రభుత్వమే భూముల ఖాతాలు,…
గోరంట్ల మాధవ్ వ్యవహారంలో.. 12 మంది పోలీసులపై చర్యలు వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 12మంది పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐ టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు తీసుకొస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీస్ కాన్వాయ్ ను వెంబడించడం, గుంటూరు చుట్టగుంట సెంటర్ లో కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. ఎస్పీ కార్యాలయంలోకి…
అభిషేక్ శర్మ స్లిప్ సెలబ్రేషన్.. రాసుకొచ్చి మరి విధ్వంసం.. పంజాబ్ పై సన్‌రైజర్స్ ఘన విజయం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 247/2 స్కోరు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో హీరో…
బెంగాల్ హింసపై ఎన్ఐఏ దర్యాప్తు చేయాలి.. కేంద్రాన్ని కోరిన బీజేపీ నేత.. పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో అల్లర్లు జరిగాయి. కొందరు దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలోని రైల్వే స్టేషన్లలో జరిగిన అనేక విధ్వంసక సంఘటనలు జరిగాయి. అయితే, ఈ అల్లర్లపై ఎన్ఐఏ దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కి లేఖ రాశారు.…
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ.. జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి నాపై ఆధారాలు లేని ఆరోపణలు చేసి ప్రజల్లో నా పలుకుబడి గుర్తింపును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుండు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలను, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాను.. పదే పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలి అంటున్నాడు.. ప్రస్తుతం ఈ…
బీజేపీ, అన్నాడీఎంకే పొత్తును ప్రకటించిన అమిత్ షా.. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మాజీ సీఎం ఎడప్పాడి పళని స్వామి నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో పళని స్వామి మాట్లాడుతూ.. రెండు…