తీరం వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. భారీ వర్షాలు..! ఏపీకి మరోసారి వాన గండం పొంచి ఉంది. ప్రస్తుతం పశ్చిమమధ్యబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది రేపు ఉదయం తీరం దాటే ప్రమాదం ఉందంటోంది వాతావరణశాఖ. దీంతో ఏపీ ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 300 కి.మీ., గోపాల్‌పూర్‌కు 300 కి.మీ., పారాదీప్‌కు 400 కి.మీ.…
వర్షంలో ఫోన్ మాట్లాడుతుండగా పిడుగు.. విద్యార్థిని మృతి వర్షం పడుతుందంటే సెల్‌ఫోన్ మాట్లాడొద్దు.. టీవీలు ఆపేయండి.. అని ఇంట్లో పెద్దలు హెచ్చరిస్తుంటారు.. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు ఈ హెచ్చరికలు చేస్తుంటారు.. ఇప్పటికే పలువురిని ఈ పిడుగులు బలి తీసుకున్నాయి కూడా.. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లో మరో విద్యార్థిని పిడుగుపాటుకు బలైపోయింది.. అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకులోయలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అనంతగిరి మండలం పెదబిడ్డ పంచాయతీ చెరుకుమడత గ్రామంలో.. మంగళవారం పిడుగుపాటుకు…
కామినేని, బాలకృష్ణ ఎపిసోడ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్..! ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేనే లేదు.. మొత్తం అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రులే ఉన్నారు. అయినా, అసెంబ్లీ హాట్ టాపిక్‌గా సాగుతోంది.. ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రతిపక్షం సభలో లేకపోయినా.. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల తీరే.. ఆ కూటమిలో చిచ్చు పెట్టేలా తయారవుతోంది.. మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ వ్యవహారం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ వర్సెస్ బోండా ఉమగా మారిపోయింది..…
పల్నాడులో రోడ్డు ప్రమాదం.. తిరుపతికి చెందిన డాక్టర్ సహా ఇద్దరు మృతి.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వైద్యుడు, అతని కూతురు మృతిచెందారు.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరుపతికి చెందిన వైద్యుడు కిషోర్ కుటుంబ సభ్యులతో కలిసి కారులో గుంటూరు బయల్దేరి వెళ్తుండగా.. తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం…