తెలుగులో తిట్టినా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషను మర్చిపోయిన వాడు మనిషే కాదు..!
తెలుగులో తిట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషని మరిచిపోయినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు.. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో భారత జ్యోతి పురస్కార ప్రదాన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సమాజ పరిశీలనా శోధకుడు, శోధన సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు భారత జ్యోతి పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. పిడికె రావు సేవలను విని, ఆయన్ని కలవాలని, అవార్డు ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను అన్నారు.. తెనాలి ప్రాంతానికి ఎంతో అభిమానం, ఇక్కడి నుంచి ఎన్నో పోరాటాలు చేశాం. సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడడం యువత బాధ్యత.. యువత గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.. ఇక్కడ కలిసిన దృష్టి అవార్డు ఇవ్వటం మాత్రమే కాదు, మానవత్వపు విలువలు కాపాడుకోవడం కూడా అన్నారు.. ఇక, అమ్మ భాషను మరచినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు.. ఇక, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలుగు పరిపాలన చేపట్టమని సూచించాను.
రాజధాని ప్రాంత రైతులతో చంద్రబాబు సమావేశం.. రెండవ దశ భూ సమీకరణకు రైతుల అంగీకారం..!
రాజధాని అమరావతి ప్రాంత రైతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. ప్రతి మూడు నెలలకు ఒకసారి రైతులతో సమావేశం అవుతానని చెప్పారు చంద్రబాబు.. త్రిసభ్య కమిటీ ప్రతినెల రైతులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ఇక, రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా విన్న చంద్రబాబు… రైతుల ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.. ఇక, ఈ సందర్భంగా అమరావతి రైతులు మాట్లాడుతూ.. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కొన్ని సమస్యలు వచ్చాయి.. కొంత మంది రైతుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే.. ఈ రోజు ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత అందరి రైతులు ఏకాభిప్రాయంతో ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాం అని ప్రకటించారు.. చంద్రబాబును చూసే భూములు ఇచ్చాం.. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకం కలిగింది అన్నారు.. రెండవ దశ భూ సమీకరణకు.. మేము కూడా మద్దతు తెలుపుతున్నాం అని వెల్లడించారు.. కొంతమంది ఇక్కడ భూముల అభివృద్ధి చేయకుండా మళ్లీ భూ సమీకరణ ఏంటని మాట్లాడుతున్నారు… ఇక్కడ అభివృద్ధి చేస్తూనే… అక్కడ కూడా అభివృద్ధి విస్తరణ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని తెలిపారు.. సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత రైతులందరూ సంతృప్తిగా ఉన్నారని ప్రకటించారు అమరావతి రైతులు..
తిరుపతిలో రూ.3వేల కోట్లతో.. 600 ఎకరాల్లో ఆధ్యాత్మిక టౌన్‌షిప్
తిరుపతి నగరంలో 600 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3,000 కోట్ల వ్యయంతో మెగా ఆధ్యాత్మిక టౌన్‌షిప్ నిర్మించేందుకు డెల్లా గ్రూప్ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.. తిరుపతిలో త్వరలో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ వివరాలను మంత్రి అనగానికి డెల్లా గ్రూప్ ప్రతినిధులు వివరణాత్మకంగా వివరించారు. ఈ టౌన్‌షిప్‌లో 5 వేల ఏళ్ల హిందూ మత సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించే ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డెల్లా గ్రూప్ ప్రతినిధులు ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణగా ‘వసుదైక కుటుంబం’ (Vasudaik Family) పేరిట ప్రపంచ సేవలు, ధార్మిక అధ్యయనం, సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనలు, వసతి, విద్య, వినోదం వంటి సేవలను ఒకేచోట ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కేవలం నిర్మాణ ప్రణాళిక కాకుండా, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసే గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. త్వరిత అనుమతుల కోసం మంత్రి హామీ ఇచ్చారు.. ప్రతినిధుల విజ్ఞప్తికి స్పందించిన మంత్రి అనగాని మాట్లాడుతూ.. ఈ భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్ట్‌ను రాష్ట్రం స్వాగతిస్తోంది. టౌన్‌షిప్ నిర్మాణానికి కావాల్సిన అనుమతులు త్వరగా లభించేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.. అలాగే, ఈ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా చర్చిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.
బీసీ రిజర్వేషన్లపై ఐక్య ఉద్యమం.. ప్రధాని సమయం ఇస్తే సీఎం అధ్యక్షతన ఢిల్లీకి..
ప్రజాభవన్‌లో నిర్వహించిన టెలంగాణ ఎంపీల సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి పార్లమెంటు స్థాయిలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తొమ్మిదవ షెడ్యూల్‌లో సవరణ తప్పనిసరని పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అడ్జర్న్‌మెంట్ మోషన్ లేదా క్వశ్చన్ అవర్ ద్వారా చర్చకు తీసుకురావాలని సూచించారు. అన్ని పార్టీల ఎంపీలు కలిసి ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వాలి. ప్రధాని సమయం ఇస్తే, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఢిల్లీకి వెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాం” అని భట్టి విక్రమార్క తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలు అడిగిన సమాచారం గంటల్లో అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు భట్టి తెలిపారు. నీటిపారుదల, విద్యుత్, జీఎస్టీ మరియు ఇతర కీలక రంగాలకు సంబంధించిన పెండింగ్ నిధులపై ఇప్పటికే కేంద్రానికి లేఖలు పంపినట్లు గుర్తు చేశారు. ఆ లేఖలు, సంబంధిత డాక్యుమెంట్లు ఎంపీలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మరోవైపు, 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చేందుకు అవసరమైన వనరులు, ప్రణాళికలు, అమలు రూపకల్పన రాష్ట్రం సిద్ధం చేసుకుంది అని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఎంపీలకు ప్రపంచ స్థాయి సంస్థలు లేదా ప్రముఖులతో పరిచయాలు ఉంటే వివరాలు ఇవ్వండి. వారిని గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తాం” అని ఆయన అన్నారు. అయితే, రాజకీయాలు పక్కనపెట్టి — బీసీ రిజర్వేషన్లు, కేంద్ర నిధులు మరియు రాష్ట్ర అభివృద్ధి విషయాల్లో ఏకగ్రీవ పోరాటం చేయాల్సిన సమయం ఇదే అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా పార్లమెంట్ సభ్యులు అందరూ పార్టీలకు అతీతంగా ఒక బృందంగా ఏర్పడి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను విజ్ఞప్తులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని ప్రజాభవన్ లో ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు..
సర్పంచ్ ఎన్నికల కోసం ప్రత్యేక లీగల్ సెల్..
తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ లీగల్ సెల్ ముగ్గురు సూపరిండెంట్ స్థాయి అధికారులతో పర్యవేక్షించబడుతుంది. గతంలో ఎన్నికల రిజర్వేషన్లపై పలు కోర్టు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయడం, ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవడం కోసం ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. లీగల్ సెల్, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో సమన్వయం చేసి, కేసులకు సంబంధించిన వివరాలు మరియు సూచనలు 24 గంటల్లో అదనపు అడ్వకేట్ జనరల్/గవర్నమెంట్ ప్లీడర్ కి అందించాలి అని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ప్రతి జిల్లాలో కోర్టు కేసులను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించి, కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన లీగల్ సెల్‌తో సమన్వయం తప్పక ఉండేలా చట్టపరమైన చర్యలు చేపడతామని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన తెలిపారు. కాగా, తెలంగాణలో మూడు దశలో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం విదితమే కాగా.. తొలి దశ నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.. ఇక, కొన్ని పంచాయతీలు, వార్డులు ఏకగ్రీవం అవుతున్నాయి..
సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు జరిగే ఏకగ్రీవాలపై.. ఎన్నికల కమిషన్ కీలక సూచనలు
తెలంగాణలో గత కొంత కాలంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. ఎట్టకేలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఎన్నికలకు సంబంధించిన తొలి దశ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఇప్పటికే పలు గ్రామాల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు జరిగే ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ కీలక సూచనలు జారీ చేసింది. వేలం ద్వారా, బలవంతంగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు జరిగే ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాల వేలంపై ప్రత్యేక పర్యవేక్షణ విభాగం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వేలం, ప్రలోభపెట్టడం, బెదిరింపులు, బలవంతం, ఇతర సంబంధిత చర్యల నివేదికలను ఎన్నికల అధికారులు రియల్ టైమ్‌లో వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని తెలిపింది.
డీకే వ్యాఖ్యలకు కౌంటర్‌గా సిద్ధరామయ్య సంచలన ట్వీట్..
కర్ణాటక కాంగ్రెస్‌లో పవర్ షేరింగ్ వివాదం మరింత ముదిరింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2023 ఎన్నికల తర్వాత, అధిష్టానం హామీ ఇచ్చినట్లు చెరో రెండున్నరేళ్లు సీఎం పోస్టును పంచుకోవాల్సిందే అని డీకే శివకుమార్ వర్గం చెబుతోంది. మరోవైపు, సిద్ధరామయ్యనే 5 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పంచాయతీ కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంది. ఇదిలా ఉంటే, ఈ రోజు ఉదయం డీకే శివకుమార్ ‘‘ మాట అనే శక్తి అంటే ప్రపంచ శక్తి’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పరోక్షంగా ఇచ్చిన మాట తప్పకూడదని చెప్పారు. అయితే, దీనికి కౌంటర్‌గా సిద్ధరామయ్య సంచలన ట్వీట్ చేశారు. ‘‘ఒక మాట ప్రపంచాన్ని, ప్రజలకు ప్రయోజనంగా చేయకపోతే అది శక్తి కాదు’’ అని కామెంట్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య పరోక్షంగా మాటల యుద్ధం జరుగుతోందని స్పష్టమవుతోంది. ఇక్కడితో ఆగకుండా.. ‘‘ కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక మూమెంట్ కాదు, ఇది ఐదేళ్లు కొనసాగే బాధ్యత. నాతో సహా కాంగ్రెస్ పార్టీ కరుణ, స్థిరత్వం, ధైరంతో మన ప్రజల కోసం వాగ్ధానం నడుస్తుంది. కర్ణాటకలో మన హామీలు నినాదం కాదు, అది మనకు ప్రపంచం’’ అని సిద్ధరామయ్య కామెంట్స్ రాశారు.
పౌరసత్వానికి “ఆధార్” రుజువు కాదు..
కేంద్రం ఎన్నికల సంఘం, ఎన్నికల జాబితా సవరణల కోసం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ప్రారంభించింది. ఇటీవల, బీహార్ ఎన్నికల ముందు ఈ ప్రక్రియను ఈసీ మొదలుపెట్టింది. ఇప్పుడు బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సర్‌ను చేపడుతోంది. ఇదిలా ఉంటే , సర్‌ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. సుప్రీంకోర్టు బుధవారం దీనిపై తుది వాదనలు ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం సర్ పిటిషన్లపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆధార్‌ను పౌరసత్వానికి ప్రశ్నించలేని రుజువుగా పరిగణించలేము’’ అని స్పష్టం చేసింది. ఓటర్‌గా నమోదు చేయడానికి ఉపయోగించే ఫారమ్ 6లోని ఎంట్రీల ఖచ్చితత్వాన్ని నిర్ణయించే స్వాభావిక అధికారం ఎన్నిక సంఘానికి ఉందని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. ఆధార్ కార్డ్ అనేది సంక్షేమ పథకాలు, సౌకర్యాలు పొందేందుకు మంజూరు చేయబడిందని, ఒక విదేశీయుడు ఆధార్ కార్డ్ కలిగి ఉంటే, అతడికి ఓటు హక్కు ఇవ్వాలా? వేరే దేశానికి చెందిన వాడు కార్మికుడిగా పనిచేస్తున్నారని అనుకుంటే, అతడికి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలా? అని సీజేఐ ప్రశ్నించారు.
పాకిస్థాన్ అణు బటన్ మునీర్ చేతుల్లోకి.. కొత్త పాత్రలోకి ఆర్మీ చీఫ్
పాకిస్థాన్‌లో సైన్యం ప్రభావం కొత్త దశలోకి ప్రవేశించింది. ఇటీవల అమలులోకి వచ్చిన 27వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. పాకిస్థాన్ తొలి రక్షణ దళాల చీఫ్ (CDF) గా ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ గురువారం నియమితులయ్యారు. దీంతో మునీర్ ఇప్పుడు మూడు సేవలకు సుప్రీం కమాండర్ అయ్యాడు. సైన్యం, వైమానిక దళం, నౌకాదళానికి ఆయనే అధినేత. ఆయన ఈ పోస్ట్‌లో ఐదు సంవత్సరాలు ఉండనున్నారు. ఈ సవరణ తర్వాత ఛైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (CJCSC) పదవి రద్దు చేశారు. సీడీఎఫ్ పాత్ర పాకిస్థాన్‌లో 1976 నుంచి ఉంది, కానీ ప్రస్తుత CJCSC జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా పదవీ విరమణతో ఈ పదవి రద్దు చేశారు. 240 మిలియన్ల జనాభా, అణుశక్తి కలిగిన పాకిస్థాన్, చాలా కాలంగా పౌర, సైనిక పాలన మధ్య ఊగిసలాడుతోంది. జనరల్ పర్వేజ్ ముషారఫ్ చివరిసారిగా 1999లో అధికారాన్ని చేజిక్కించుకుని బహిరంగ సైనిక పాలనను స్థాపించారు. ఆ తర్వాత డెమోక్రటిక్ ప్రభుత్వాలు వచ్చాయి, కానీ దేశంలో సైన్యం ప్రభావం బలంగానే ఉంది. కొత్త సవరణలు బంగారు మార్కెట్‌ను మరింత బలోపేతం చేశాయి.
200MP కెమెరాను విడుదల చేసిన సోనీ.. కొత్త సెన్సార్‌ను మొదటగా పొందే స్మార్ట్‌ఫోన్ ఏదంటే?
సోనీ సెమికండక్టర్ సొల్యూషన్స్ కార్పొరేషన్, మొబైల్ కెమెరా టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీ. సోనీ తన ఫ్లాగ్‌షిప్ LYT-901 మొబైల్ కెమెరా సెన్సార్‌ను స్మార్ట్‌ఫోన్‌ల కోసం విడుదల చేసింది. ఈ కెమెరా సెన్సార్ కంపెనీకి చెందిన మొట్టమొదటి 200-మెగాపిక్సెల్ లెన్స్. సోనీ ఈ 200-మెగాపిక్సెల్ కెమెరాను ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం రూపొందించింది. ఈ కెమెరా సెన్సార్ సామ్ సంగ్ 200-మెగాపిక్సెల్ సెన్సార్‌తో నేరుగా పోటీపడుతుంది. సోనీ LYT-901 లెన్స్ 0.7μm పిక్సెల్‌లతో జత చేయబడిన భారీ 1/1.12″ ఇమేజింగ్ సర్ఫేస్ ను కలిగి ఉంది. ఈ సెన్సార్ 200-మెగాపిక్సెల్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. సోనీ ఈ ఇమేజ్ సెన్సార్‌ను LYTIA సిరీస్ లేబుల్ కింద విడుదల చేసింది. ఇమేజ్ సెన్సార్‌లో, సోనీ పిక్సెల్ గ్రిడ్ కోసం క్వాడ్-క్వాడ్ బేయర్ మొజాయిక్ టెక్నాలజీని ఉపయోగించింది. సెన్సార్ అంతర్గత రీబార్ సర్క్యూట్‌లో కంపెనీ AI లాజిక్‌ను ఉపయోగించింది. దీని వలన ప్రాసెసర్ డెన్స్ పిక్సెల్ డేటాను నిర్వహించడం సులభం అవుతుంది. HDR కోసం, సోనీ కీలక విధానాలను కలిపింది. ఈ లెన్స్ డ్యూయల్ కన్వర్షన్ గెయిన్ HDRతో హైబ్రిడ్ ఫ్రేమ్-HDRని ఉపయోగిస్తుంది. ఈ లెన్స్ కీలక అంశం దాని జూమింగ్ సామర్థ్యం. ఈ సెన్సార్ ఫోటోల కోసం 2x హార్డ్‌వేర్ జూమ్‌ను, స్టిల్స్, వీడియో కోసం 4x ఇన్-సెన్సార్ జూమ్‌ను నిర్వహిస్తుంది. 4x జూమ్‌లో, ఫోన్‌లు ఎటువంటి అదనపు ఆప్టికల్ లెన్స్ స్టెప్ లేకుండా వర్చువల్ టెలిఫోటో వీక్షణను ప్రసారం చేయగలవు.
సింగర్‌గా నవీన్ పొలిశెట్టి.. ‘అనగనగా ఒకరాజు’ ఫస్ట్ సాంగ్ విన్నారా !
తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఈ హీరో వెండి తెరపై సినీ ప్రేమికులను పలకరించి చాలా రోజులు అయ్యింది. నవీన్ పొలిశెట్టి చివరగా అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం తర్వాత నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేసే టైంలో ఆయనకు యాక్సిడెంట్ అవ్వడం, దాన్నుంచి కోలుకున్న తర్వాత చేస్తున్న చిత్రం ‘అనగనగా ఒకరాజు’. ఎప్పటి నుంచో నవీన్ పొలిశెట్టిని వెండి తెరపై చూడాలని ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు సంక్రాంతి గిఫ్ట్‌గా ఈ సినిమా థియేటర్స్‌లోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ‘అనగనగా ఒకరాజు’ సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా, ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా 14 జనవరి 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి భీమవరం బాల్మ.. అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను నవీన్ పోలిశెట్టి, నూతన మోహన్ పాడారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తు్న్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సాంగ్‌కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.