రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే 2 నుంచి 9వ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మే 3న తెలుగు, మే 4న ఇంగ్లిష్ అర్హత పరీక్షలు జరుగుతాయి. ఇక మే 5 నుంచి 9వ వరకు మెయిన్స్‌లో ప్రధాన పరీక్షలు జరుగుతాయి. మొత్తం 89 పోస్టులకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 4496 అభ్యర్ధులు…
కూటమి నేతల మధ్య విభేదాలు.. చెక్ పెట్టే పనిలో పెద్దలు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఏర్పడిన విభేదాలకు చెక్ పెట్టే పనిలో ఇరు పార్టీల పెద్దలు రంగంలో దిగినట్టు తెలుస్తోంది. విజయవాడలో తాడేపల్లిగూడెంకు చెందిన టీడీపీ ఇంచార్జి వలవల బాబ్జి, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌లతో సమన్వయ కమిటీ భేటీ నిర్వహించింది. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ…
5 లక్షల మంది, 6600 బస్సులు: ఏపీ రాజధాని అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమం రేపు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ టూర్ గంటా 25 నిమిషాలు పాటు ఉండనుంది. 58 వేల కోట్ల విలువైన పనుల శంఖుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రధాని మోడీ చేతుల మీద జరగనున్నాయి. అమరావతి పునఃనిర్మాణ పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కానున్న వేళ రాజధానికి తరలివచ్చే వారి కోసం ప్రభుత్వం రవాణా వసతిని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రైవేట్ విద్యా…
ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమణ.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం శ్రేయాస్ అయ్యర్ (72), ప్రభ్సిమ్రాన్ సింగ్ (54) అర్ధ సెంచరీలతో పాటు యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ సాధించడంతో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఓటమితో, 5 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. 18వ సీజన్లో ఇప్పటివరకు చెన్నై 10 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. చెన్నై…
బెయిల్‌పై విడుదలైన గోరంట్ల మాధవ్: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బెయిల్‌పై విడుదల అయ్యారు. గుంటూరు కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పదివేల పూచీకత్తు, ఇద్దరు జామీన్ల హామీతో బెయిల్ మంజూరైంది. రెండు నెలల పాటు ప్రతి శనివారం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలన్న కోర్టు ఆదేశించింది. గోరంట్ల మాధవ్ ఈ నెల 11 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో…